📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Cargo ship :ఉత్తర పసిఫిక్‌ మహా సముద్రంలో మునిగిన కార్గో నౌక

Author Icon By Sudha
Updated: June 25, 2025 • 4:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అలస్కాలోని అలూటియన్‌ దీవుల వద్ద (Aleutian Islands) 3,000 కార్లతో వెళ్తున్న “మోర్నింగ్ మిడాస్” (Morning Midas) అనే కార్గో నౌక సముద్రంలో పూర్తిగా మునిగిపోయింది. ఈ నౌక మునిగిన విషయం లండన్‌కు చెందిన ఓడ నిర్వహణ సంస్థ జోడియాక్‌ మారిటైమ్‌ (Zodiac Maritime) అధికారికంగా ప్రకటించింది. మూడు వేల కార్ల లోడుతో మెక్సికో (Mexico) కు వెళ్తూ అగ్నిప్రమాదానికి గురైన ఆ కార్గో నౌక (Cargo ship) ఉత్తర పసిఫిక్‌ మహా సముద్రంలో మునిగిపోయింది. కొన్ని వారాల క్రితం ఆ నౌకలో మంటలు చెలరేగాయి. అప్పటి నుంచి క్రమంగా మునుగుతూ ఆ నౌక ఇప్పుడు పూర్తిగా మునిగిపోయింది. నౌకలో మొత్తం 3 వేల కార్లు ఉండగా, వాటిలో 800 ఎలక్ట్రిక్‌ కార్లు ఉన్నాయి.

Cargo ship :ఉత్తర పసిఫిక్‌ మహా సముద్రంలో మునిగిన కార్గో నౌక

పెద్దగా కాలుష్యం లేదు
అలస్కాలోని అలూటియన్‌ దీవుల వద్ద ఈ నౌక మునిగిపోయిందని లండన్‌కు చెందిన ఓడ నిర్వహణ సంస్థ జోడియాక్‌ మారిటైమ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ఘటన తర్వాత అంత పెద్దగా కాలుష్యం వెలువడలేదని యూఎస్ కోస్ట్‌గార్డ్‌ ప్రతినిధి వెల్లడించారు. కాలుష్య నియంత్రణ పరికరాలు కలిగిన రెండు సాల్వేజ్‌ టగ్‌లను అక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మరో నౌక రక్షించింది
జూన్‌ 3న రవాణా నౌకలో అగ్నిప్రమాదం జరిగిందని తమకు సమాచారం వచ్చిందని యూఎస్ కోస్ట్‌ గార్డ్‌ ప్రతినిధి తెలిపారు. ప్రమాద సమయంలో నౌకలో 22 మంది సిబ్బంది ఉండగా వారందరూ లైఫ్‌బోట్‌ల ద్వారా బయటపడ్డారని వివరించారు. ఆ సమయంలో సమీపంలోని మర్చంట్‌ మెరైన్‌ అనే మరో నౌక వారిని రక్షించిందన్నారు. నౌక వెనుక భాగంలో ఎక్కువగా ఎలక్ట్రిక్‌ వాహనాలు ఉండటంతో పెద్ద మొత్తంలో పొగలు కనిపించాయని తెలిపారు.
ఈ ప్రమాదానికి తరువాత సముద్ర కాలుష్యం పెద్దగా సంభవించలేదని స్పష్టం చేశారు.పీటెరోలియం ఉత్పత్తులు లేదా హానికర రసాయనాలు సముద్రంలోకి విడుదల కానివ్వకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.ప్రస్తుతానికి సముద్ర కాలుష్యం గణనీయంగా కనిపించలేదని US Coast Guard ప్రతినిధి వెల్లడించారు.

Read Also:Union Minister Piyush Goyal : 2027లో మూడో అతిపెద్ద ఎకానమీ

#CargoShipSinks #ElectricVehicle #EVBatteryFire #MaritimeSafety #MorningMidas Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.