టన్నెల్ ప్రమాదంపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్

Read Time:  1 min
MLC Kavitha tweet on tunnel accident
MLC Kavitha tweet on tunnel accident
FONT SIZE
GET APP

ప్రమాదంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెంటనే స్పందించాలి

హైదరాబాద్‌: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శ్రీ శైలం ఎడమ కాలువ గట్టు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద ప్రమాదం ట్వీట్ చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెంటనే స్పందించాలని పనులు మొదలు పెట్టిన వెంటనే ప్రమాదం ఎలా జరిగిందో తేల్చాలని కవిత ‘ఎక్స్’ వేదికగా డిమాండ్ చేశారు. ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌ పై కప్పు కూలిన ఘటనలో కూలీలు గాయపడటం అత్యంత దురదృష్టకరమన్నారు.

టన్నెల్ ప్రమాదంపై ఎమ్మెల్సీ కవిత

దీనికి ఎవరు బాధ్యులు?

కేసీఆర్‌ హయాంలో 10 కి.మీ. మేర టన్నెల్‌ తవ్వారని..ఏనాడూ ఇటువంటి ప్రమాదం జరగలేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 4 రోజుల కిందనే పనులు మొదలు పెట్టిందని..అంతలోనే ఈ పెను ప్రమాదం ఎలా జరిగిందని ప్రశ్నించారు. దీనికి ఎవరు బాధ్యులని? కవిత అడిగారు. నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఈ ఘటనపై స్పందించాల్సిన అవసరముందని డిమాండ్ చేశారు. ఇంకా 9 కి.మీ.లకు పైగా టన్నెల్‌ తవ్వాల్సి ఉందని.. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు.

ఆకస్మాతుగా కూలిన పైకప్పు

కాగా, ఈరోజు ఉదయం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్‌ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. మొదటి షిఫ్ట్‌లో సుమారు 50 మంది కార్మికులు సొరంగంలోకి వెళ్లారు. ఉదయం 8.30 గంటల సమయంలో కార్మికులు పని చేస్తుండగా.. ఆకస్మాతుగా పైకప్పు కూలి మట్టిపెల్లలు విరిగి పడ్డాయి. దీంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.