📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Uttam : ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్త‌మ్ సమీక్ష

Author Icon By Sudheer
Updated: April 19, 2025 • 10:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యాసంగి ధాన్యం కొనుగోళ్లు మరియు తాగునీటి సరఫరాపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని స్పష్టం చేశారు. ప్రతి జిల్లా కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పర్యటించి కొనుగోళ్లను సమర్ధవంతంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.

యాసంగిలో రికార్డు స్థాయిలో 127.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం

ఈ ఏడాది యాసంగిలో రికార్డు స్థాయిలో 127.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఆశించవచ్చని తెలిపారు. వానకాలం మరియు యాసంగి కలిపి మొత్తం 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్రానికి దిగుబడి వస్తుందని మంత్రి తెలిపారు. ఈ ధాన్యం మొత్తాన్ని సమర్థవంతంగా సేకరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 8,329 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కేంద్రాల ద్వారా మొదటివిగా 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ధేశించారని చెప్పారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఎక్కడా అంతరాయం కలగవద్దు

ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఎక్కడా అంతరాయం కలగకుండా చూడాలని, అవసరమైన వాటర్ ఫెసిలిటీ, తూకం, ట్రాన్స్‌పోర్ట్, గోదాముల నిర్వహణ వంటి అంశాలపై ముందుగానే చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు మంత్రి ఉత్తమ్ సూచించారు. రైతులకు నష్టమొచ్చే పరిస్థితులు రాకుండా, వారికి త్వరితగతిన చెల్లింపులు జరగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.

Google News in Telugu review of grain purchases uttam kumar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.