📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Waqf Amendment Bill : రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టన మంత్రి కిరణ్‌ రిజిజు

Author Icon By sumalatha chinthakayala
Updated: April 3, 2025 • 2:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Waqf Amendment Bill : లోక్‌సభలో సుదీర్ఘ చర్చ అనంతరం ఆమోదం పొందిన వివాదాస్పద వక్ఫ్‌ (సవరణ) బిల్లు.. ఇప్పుడు రాజ్యసభ ముందుకొచ్చింది. కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు గురువారం ఈ బిల్లును ఎగువ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ ప్రారంభించారు. ప్రస్తుతం రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు పై చర్చలు కొనసాగుతున్నాయి. ఇక, ఈ బిల్లుపై బుధవారం లోక్‌సభలో 14 గంటలకు పైగా చర్చ జరిగింది. విపక్షాల ఆరోపణలు, అధికారపక్షం కౌంటర్లతో సభ వాడీవేడిగా సాగింది.

56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు

అనంతరం ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహించగా. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. రాజ్యసభలోనూ దీనిపై చర్చ కోసం 8 గంటలు కేటాయించారు. అవసరమైతే సమయాన్ని పెంచనున్నారు. అనంతరం ఓటింగ్‌ చేపడతారు. ఎగువ సభలోనూ అధికార ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం ఉండటంతో బిల్లు గట్టెక్కడం లాంఛనమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉభయ సభల్లో ఆమోదం పొందిన అనంతరం రాష్ట్రపతి సంతకంతో ఇది చట్టంగా మారనుంది.

మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసేలా ఈ కొత్త బిల్లు

వక్ఫ్‌ పాలకవర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసేలా ఈ కొత్త బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ఈమేరకు 1995 నాటి వక్ఫ్‌ చట్టంలో దాదాపు 40 సవరణలు చోటుచేసుకోనున్నాయి. ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ బిల్లును గతేడాది ఆగస్టులోనే కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అప్పుడు దీనిపై విపక్షాల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో దీనిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపింది. ఈ కమిటీ పలు ప్రతిపాదనలతో బిల్లుకు ఆమోదం తెలిపింది.

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Minister Kiren Rijiju Paper Telugu News Rajya Sabha Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Waqf Amendment Bill

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.