📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Floor Painting : కృష్ణ‌మ్మ తీరంలో కుంచెతో కోటి భావాలు

Author Icon By Sudheer
Updated: July 13, 2025 • 5:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ నగరపాలక సంస్థ (VMC) ఆధ్వర్యంలో ఆదివారం హరిత హారం పార్కులో ఏర్పాటు చేసిన ఫ్లోర్ పెయింటింగ్ మరియు డ్రాయింగ్ పోటీలకు యువత, చిన్నారుల నుంచి విశేష స్పందన లభించింది. 300 మందికి పైగా పాల్గొన్న ఈ పోటీలలో వారు తమ కళా ప్రతిభను ప్రదర్శించి, పర్యావరణ అంశాలపై జాగ్రత్తగా ఆలోచించేలా చిత్రాలు వేశారు. స్వర్ణాంధ్ర విజన్ @2047, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, స్వచ్ఛత, నీటి పరిరక్షణ, రీసైకిల్ తదితర థీమ్స్‌పై వేసిన చిత్రాలు ప్రజలలో చైతన్యం కలిగించాయి. ఈ సందర్భంగా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ మాట్లాడుతూ, ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వాడ నగరానికి స్ఫూర్తిదాయక మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు.

పర్యావరణంపై అవగాహన కలిగించే వారపు కార్యక్రమాలు

ఈ పోటీల విజయవంతంగా నిర్వహణతో ఉత్సాహం పొంది ప్రతివారం హరిత హారం పార్కులో సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఫొటోగ్రఫీ, యోగా, స్విమ్మింగ్ వంటి కార్యక్రమాలతో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. భవానీ ఐలాండ్‌లో బర్డ్స్ ఫొటోగ్రఫీ పోటీలు, జిల్లాలోని పర్యాటక ప్రాంతాలలో వేర్వేరు థీమ్స్‌తో కార్యక్రమాల నిర్వహణకు సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమాల వల్ల చిన్నారుల్లో అవగాహన పెరిగి, సెలవులను సద్వినియోగం చేసుకునేలా మారతారని పేర్కొన్నారు.

పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం

పోటీల విజేతలకు కలెక్టర్ లక్ష్మీశ‌, కమిషనర్ ధ్యానచంద్రలు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఫ్లోర్ పెయింటింగ్‌లో జి.తనూజ మొదటి బహుమతి రూ. 10,000 పొందగా, డ్రాయింగ్ విభాగంలో ఎంఎస్ వైష్ణవ్య తొలి బహుమతి అందుకుంది. ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా పి.చిదంబరేశ్వరరావు తదితరులు వ్యవహరించారు. ఇదే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 అవార్డుల్లో విజయవాడ నగరం సూపర్ స్వచ్ఛతా లీగ్ అవార్డు గెలుచుకోవడం గర్వకారణమని అధికారులు తెలిపారు. ఇది ప్రజలు, సిబ్బంది అందరి కృషికీ ఫలితమని పేర్కొన్నారు.

Read Also : Bonalu : ఘ‌నంగా ఉజ్జ‌యిని మ‌హంకాళి బోనాల జాత‌ర

Google News in Telugu Krishnamma shore Millions of feelings Vijayawada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.