📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు

Metro : ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో- సీఎం రేవంత్

Author Icon By Sudheer
Updated: April 11, 2025 • 8:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మెట్రో రైలుకు మరింత విస్తరణ కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి చర్యలు వేగవంతం చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో సేవలను విస్తరించాలని నిర్ణయించిన సీఎం, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రెండో దశ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ద్రాఫ్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్

ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ద్రాఫ్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR)ను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. మొత్తం 76.4 కిలోమీటర్ల విస్తరణకు రూ.24,269 కోట్ల వ్యయంతో ఈ ప్రతిపాదనలు రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మెట్రో మార్గాలు కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు మెట్రో లింక్ కల్పించనున్నాయి.

కేంద్రం నుండి అనుమతుల కోసం ఎదురుచూపు

కేంద్రం నుంచి అనుమతులు వచ్చేసరికి పనులు తక్షణమే ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎం సూచించారు. మెట్రో విస్తరణ వల్ల రాబోయే రోజుల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తక్కువవై, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పౌర సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

cm revanth hyderabad metro

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.