📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Atheist Krishna : మీమ్స్ సృష్టికర్త కృష్ణ ఇకలేరు

Author Icon By Sudheer
Updated: July 24, 2025 • 3:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒడిషాకు చెందిన ప్రముఖ ఫోటోషాప్ కళాకారుడు, మీమ్స్ సృష్టికర్త అథియస్ట్ కృష్ణ (Atheist Krishna) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, జూలై 23న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కృష్ణ మృతితో సోషల్ మీడియా అభిమానుల్లో విషాదం నెలకొంది. చిన్న వయసులోనే అకాల మరణం చెందడం అందరినీ తీవ్ర విషాదంలో ముంచింది. అభిమానులు, స్నేహితులు, ప్రముఖులు ఆయన మృతి పట్ల శోక సందేశాలు వ్యక్తం చేస్తున్నారు.

మీమ్స్, ఫోటో ఎడిటింగ్‌కి కొత్త ఊపిరినిచ్చిన కళాకారుడు

కృష్ణ అసలు పేరు రాధాకృష్ణ సంగా. కానీ “Atheist Krishna” అనే పేరుతో సోషల్ మీడియాలో తనదైన శైలి కల మీమ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. హాస్య ప్రధానమైన ఫోటో ఎడిటింగ్‌తో పాటు, పాతదైన, దెబ్బతిన్న ఫోటోలను జీవం పోసేలా పునరుద్ధరించడంలోనూ తన ప్రత్యేకతను చూపించాడు. కృష్ణ నైపుణ్యం చాలామంది సెలబ్రిటీలను ఆకట్టుకుంది. తన అద్భుత ఫోటో ఎడిటింగ్ కళతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు.

ప్రధానమంత్రి నుంచి బాలీవుడ్ సెలబ్రిటీల ప్రశంసలు

అథియస్ట్ కృష్ణ టాలెంట్‌పై దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ముఖ్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ వంటి ప్రముఖుల దృష్టిని ఆకర్షించి, వారి ప్రశంసలు పొందడం ఆయన ప్రతిభకు నిదర్శనం. సామాన్యుల్లోనే అసాధారణ ప్రతిభ ఉంటుందని కృష్ణ తన పనితో నిరూపించారు. ఈ యువ కళాకారుడి మరణం దేశ వ్యాప్తంగా మీమ్స్ ప్రేమికులు, క్రియేటివ్ కమ్యూనిటీకి తీరని లోటుగా నిలిచింది.

Read Also ; Elephant : ఏనుగు దాడిలో మల్టీ మిలియనీర్‌ మృతి

Atheist Krishna Atheist Krishna dies atheist krishna health problems Google News in Telugu pneumonia

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.