ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం (Medaram) సమ్మక్క సారలమ్మకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. భక్తులు, వీఐపీల కోసం రూ.5 కోట్లతో గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టనున్నారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరుగుతుంది. కాకతీయ రాజుల కాలం నుంచి వస్తున్న ఈ జాతరకు కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు (Better facilities) కల్పించే దశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ములుగు జిల్లాలో ఈ జాతర జరుగుతుంది. ముఖ్యంగా.. జాతర సమయంలో భక్తులు, వీఐపీలు బస చేయడానికి వీలుగా మేడారం (Medaram) లో గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికి నాలుగునూట్ల గెస్ట్ హౌస్ నిర్మాణానికి ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ (Vikas Raj) అనుమతులు ఇచ్చారు.
గెస్ట్ హౌస్ నిర్మాణంతో భక్తులకు మెరుగైన వసతులు
ఈ గెస్ట్ హౌస్ నిర్మాణం, జాతర నిర్వ హణలో సౌకర్యాలను గణనీయంగా మెరుగు పరుస్తుంది. గెస్ట్ హౌస్ నిధుల మంజూరు వెనుక మంత్రి సీతక్క కృషి ఉండని.. ఆమె ప్రయత్నాలు ఫలించాయని స్థానికంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుంభమేశాను తలపించే ఈ సమ్మక్కసారలమ్మ జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు పటిష్టంగా… ప్రణాళికాబద్ధంగా ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. జాతరలో తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల ఏర్పాటు, విద్యుత్ శాఖ సేవలు, రోడ్ల మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి ప్రత్యేక నిధులు కేటాయించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.గత మేడారం (Medaram) జాతరకు సుమారు కోటి మందికి పైగా భక్తులు హాజరైనట్లు అధికారులు అంచనా వేశారు. ఇది జాతర ప్రాముఖ్య తను, దాని నిర్వహణకు అవసరమైన పనరులను తెలియజేస్తుంది. ఈ భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు తాగునీరు, పారిశుద్ధం. వైద్య సేవలు, రవాణా సౌక ర్యాలు వంటి ప్రాథమిక వసతులు కల్పించడం ک పెద్ద సవాలు. కొత్తగా నిర్మంచనున్న గెస్ట్ హౌస్, ఇతర మోలిక సదుపాయాల అభివృద్ధి భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందిస్తుంది.
గిరిజన గౌరవానికి ప్రతీకగా మేడారం జాతర
ఇది జాతర నిర్వహణ సామర్ధ్యాన్ని పెంచడంతో పాటు, గిరిజన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రభుత్వ నిబద్ధతను చాటిచెబుతుంది. తెలంగాణ సంస్కృతికి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతల మహా జాతర తేదీలు ఇటీవల అధికారకంగా ఖరారయ్యాయి. ములుగు జిల్లా. తాద్వాయి మండలం, మేదారంలోని పుణ్య క్షేతంలో 2026 జనవరి 26 నుంచి 31 వరకు నాలుగు రోజులు పాటు ఈ అద్భుతమైన పండుగ జరగమందని పూజారుల సంఘం వెల్లడించింది. ఆధ్యాత్మిక తేజస్సుతో వెల్లివిరిసే ఈ ఉత్సవం, లక్షలాది మంది భక్తులను ఆకర్షించి, దైవత్వాన్ని చాటి చెబుతుంది. మేడారం జాతర సుమారు 900 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన అపురూపమైన గిరిజన పండుగ. కాకతీయ రాజుల కాలంలో అన్యాయపు పన్నుల వసూళ్లకు వ్యతిరేకంగా సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వంటి వనదేవతలు తమ ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేశారనే కథ ఈ జాతర వెనుక ఉంది. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ, ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ మహా జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ జాతరను తెలంగాణ కుంభ మేళాగా అభివర్ణిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగలలో ఒకటిగా ఇది గుర్తింపు పొందింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో, పెద్ద జాతర మధ్యలో అంటే, 2025 ఫిబ్రవరిలో మేదారంలో మినీ జాతరను నిర్వహించారు. ఈ మినీ జాతర కూడా భక్తులకు వన దేవతల దర్శనం కల్పించే ఒక ముఖ్యమైన అవకాశంగా మారింది. ఈ మహా వేడుకకు దేశం నలుమూలల నుంచి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలైన రక్తిస్గర్. ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రాంతాల నుంచి కూడా కోటి మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది.
ప్రపంచంలో అతి పెద్ద జాతర ఏది?
సమ్మక్క సారక్క జాతర అనేది వరంగల్ నగరం నుండి దాదాపు 100 కి.మీ దూరంలో జరిగే గిరిజన హిందూ పండుగ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన సమాజం జరిగే సమయం, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి (ద్వైవార్షిక) జరుగుతుంది, నాలుగు రోజుల వ్యవధిలో సుమారు పది మిలియన్ల మంది ఈ ప్రదేశంలో సమావేశమవుతారు.
సమ్మక్క పుట్టిన తేదీ?
ఒక గిరిజన కథ ప్రకారం, 13వ శతాబ్దంలో వేటకు వెళ్ళిన కొంతమంది గిరిజన నాయకులు, పులుల మధ్య ఆడుకుంటూ, అపారమైన కాంతిని వెదజల్లుతున్న ఒక నవజాత బాలిక (సమ్మక్క)ను కనుగొన్నారు. ఆమెను వారి నివాసానికి తీసుకెళ్లారు.
సమ్మక్క సారక్కను ఎవరు చంపారు?
సమ్మక్క-సారక్క అనే ఇద్దరు గిరిజనులు కాకతీయ రాజు ప్రతాప రుద్రుడితో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. బలవంతపు పన్నుల నుండి వారిని ఆపడానికి కాకతీయ రాజుతో పోరాటం జరిగింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Telangana Cabinet Meeting : నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ