📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Maoists India : మావోయిస్టుల పెద్ద నిర్ణయం ఫిబ్రవరి 15 వరకు యుద్ధ పోరాటం తాత్కాలిక…

Author Icon By Sai Kiran
Updated: November 25, 2025 • 9:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Maoists India : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన నక్సలిజం ముగింపు గడువు దగ్గరపడుతున్న తరుణంలో, మావోయిస్టులు ఆశ్చర్యకరమైన అడుగు వేశారు. మహారాష్ట్ర–మధ్యప్రదేశ్–ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యులు తమ ఆయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించేందుకు 2026 ఫిబ్రవరి 15 వరకు సమయం ఇవ్వాలని కేంద్రం మరియు మూడు రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ లేఖ రాశారు.

నవంబర్ 22న విడుదలై 24న బయటకు వచ్చిన ఈ లేఖలో, అనంత్ అనే ప్రతినిధి అందరు సీఎం లను ఉద్దేశించి, తక్షణ (Maoists India) కార్యకలాపాలు నిలిపి వేయాలని అభ్యర్థించారు. పోలీసు ఆపరేషన్లు నిలిపితే తమ సర్దుబాటు, సమీక్ష, సమూహంగా నిర్ణయం తీసుకోవడం సులభమవుతుందని మావోయిస్టులు పేర్కొన్నారు.

Read Also: Stock Market: నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ఇటీవల పార్టీ సెంట్రల్ కమిటీ మరియు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వెంగోపాల్ రావు అలియాస్ సోను, “పార్టీని కాపాడుకోవాలంటే తాత్కాలికంగా ఆయుధ పోరాటం ఆపడం మంచిది” అని నిర్ణయం వెల్లడించిన విషయం తెలిసిందే. అక్టోబర్‌లో సోను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయిన తర్వాత అనేక రాష్ట్రాల్లో వరుస లొంగిపోయే ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంతోనే ప్రత్యేక జోనల్ కమిటీ కూడా ఈ మార్గాన్ని అనుసరించాలనుకుంటోంది.

ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ‍్యప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో పలువురు కీలక నాయకులు ఇప్పటికే లొంగిపోయారు. ఇటీవ‌లే ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో టాప్ నక్సల్ నేత మద్వి హిడ్మా మృతి చెంది, మావో శక్తులకు మరింత దెబ్బ తగిలింది.

తమ నిర్ణయం పార్టీ అంతర్గత చర్చల ద్వారా అమలులోకి రావాలంటే కొంత సమయం పడుతుందని, అందుకే ఫిబ్రవరి 15 వరకు గడువు కోరుతున్నామని లేఖలో వెల్లడించారు. ఇది కేంద్రం నిర్ణయించిన నక్సలిజం పూర్తిస్థాయిలో నిర్మూలన గడువు అయిన 2026 మార్చి 31 లోపే కావడం విశేషం.

ప్రతీకాత్మకంగా, ఈసారి డిసెంబర్ 2న జరగాల్సిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవం కూడా జరపబోమని మావోయిస్టులు స్పష్టం చేశారు. మంచి వాతావరణం ఏర్పడాలంటే రెండు వైపుల నుండి సహకారం అవసరమని పేర్కొన్నారు.

అదే సమయంలో, తమ నిర్ణయం దేశవ్యాప్తంగా అందరికీ చేరేలా ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రసారం చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు. తమకు ఇతర కమ్యూనికేషన్ మార్గాలు లేవని వారు అభిప్రాయపడ్డారు.

ఈ లేఖకు ముందు సెప్టెంబర్‌లో సెంట్రల్ కమిటీ రాసిన మరో లేఖలో కూడా అవకాశం కోసం అభ్యర్థించారు. ఇప్పుడు అయితే మొదటిసారి స్పష్టమైన తేదీని పేర్కొన్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Amit Shah Naxal strategy armed struggle suspension Breaking News in Telugu February 15 deadline Maoists Google News in Telugu India Maoist negotiations Latest News in Telugu Maoist surrender request Maoists India MMC Zonal Committee letter Naxalism end deadline Naxalism news 2026 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.