తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతం మళ్లీ ఉద్రిక్తతల నెత్తురోడింది. ములుగు(Mulugu) జిల్లా వాజేడు మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో జరిగిన ల్యాండ్‌మైన్ పేలుడు ఘటన మరోసారి రాష్ట్రంలో మావోయిస్టు ప్రమాదాన్ని గుర్తుచేసింది. ఈ ఘోర దాడిలో ముగ్గురు పోలీసు సిబ్బంది దుర్మరణం చెందారు. ఈ దాడి భద్రతా వ్యవస్థపై మావోయిస్టులు వేసిన సవాలుగా భావించబడుతోంది.
దాడి వ్యూహం
ఈ దాడి అనుకోకుండా జరిగినదికాదు. భద్రతా బలగాల కదలికలను ముందుగానే గుర్తించిన మావోయిస్టులు, వారికి సమీపంలోకి చేరే మార్గాన్ని ముందే పసిగట్టి ల్యాండ్‌మైన్ అమర్చారు. ఇటువంటి ప్రణాళికాబద్ధ దాడులు మావోయిస్టుల మిలిటరీ శాఖ ప్రణాళికలను సూచిస్తాయి. ఇది కేవలం ఒకసారి జరిగిన దాడి కాదు, మల్టిపుల్ ఐఈడీలు ఏర్పాటు చేసి, మరో దాడికి దారితీయగల అవకాశాలు ఉన్నాయన్న అనుమానంతో బలగాలు మరింత అప్రమత్తంగా గాలింపు కొనసాగిస్తున్నాయి.
దాడి తీరుపై తొలి సమాచారం:
భద్రతా విభాగాలకు మావోయిస్టుల(Maoists) కదలికలపై నిఘా ద్వారా ముందస్తు సమాచారం అందింది. దీంతో టాస్క్‌ఫోర్స్, గ్రేహౌండ్స్, CRPF బలగాలు తెల్లవారుజాము నుంచే కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. భద్రతా బలగాలను తాము ముందుగా అమర్చిన ల్యాండ్‌మైన్ ఉన్న ప్రదేశం వైపు మళ్లించినట్లు సమాచారం. బలగాలు నిర్దిష్ట ప్రాంతానికి చేరుకున్న వెంటనే మావోయిస్టులు ల్యాండ్‌మైన్‌ను పేల్చివేశారు. ఈ పేలుడు ధాటికి ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ దాడి మావోయిస్టులు పక్కా ప్రణాళికతోనే చేశారని స్పష్టమవుతోంది. ఈ ఘటనతో వాజేడు, వెంకటాపురం, తాడ్వాయి మండలాల్లో తీవ్ర ఉలిక్కిపాటు నెలకొంది. సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. ప్రభుత్వం ప్రజలకు భద్రత కల్పించేందుకు అదనపు బలగాలను మోహరించింది.
ప్రభుత్వ స్పందన & దర్యాప్తు:
సంఘటన జరిగిన వెంటనే అదనపు బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుని గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశాయి. ఉన్నతాధికారులు కూడా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మృతి చెందిన పోలీసుల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఈ దాడి మావోయిస్టుల కదలికలు, వారి కార్యకలాపాల తీవ్రతను మరోసారి తేటతెల్లం చేసింది. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.
Read also: Karre Gutta : కర్రెగుట్టలో ఎన్‌కౌంటర్: 22 మంది మావోయిస్టులు హతం