📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Mamunur: మామునూర్ బ్రౌన్ఫీల్డ్ ఎయిర్ పోర్టు భూసేకరణకు రూ.205 కోట్లు విడుదల

Author Icon By Ramya
Updated: July 26, 2025 • 12:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

— ఎకరాకు రూ. కోటి 20 లక్షలు చెల్లించనున్న సర్కారు

హైదరాబాద్: మామునూరు (Mamunur) వద్ద కొత్త బ్రౌన్ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూసేకరణ చేయడానికి రాష్ట్రప్రభుత్వం రూ.205కోట్లు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కె. రామ్మోహన్నాయుడు మార్చి నెలలో వరంగల్ నగరం శివారులోని మాము నూరులో ఎయిర్ పోర్టు నిర్మాణంకు సమ్మతి తెలిపారు. ఈ విమానాశ్రయానికి అన్ని అనుమతులు ఇస్తూ.. ఎయిర్ పోర్టు అధారిటీ నిర్మాణం ప్రారంభించడానికి వీలుగా సంబంధిత ఫైల్ సంతకం చేశారు. మరో 253 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇస్తే కొత్త విమానాశ్రయ నిర్మాణం మొదలు పెడతామని కేంద్ర మంత్రి ప్రకటించారు.

Mamunur: మామునూర్ బ్రౌన్ఫీల్డ్ ఎయిర్ పోర్టు భూసేకరణకు రూ.205 కోట్లు విడుదల

మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణకు వేగం పెరిగింది

ఈ నేపథ్యం లోనే భూ సేకరణ కోసం ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది. ఇదిలా ఉంటే ఇటీవలే మామునూరు (Mamunur) విమానాశ్రయం నిర్మాణానికి భూములిస్తున్న రైతులకు (farmers) రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ. కోటి 20లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించింది. అలాగే ప్లాట్లకు, ఇళ్లకు సైతం న్యాయమైన పరిహారం చెల్లించేందుకు ప్రతిపాదించడంతో భూ బాధితుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. గత నెల రోజులుగా భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణ పనులకి అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయగా.. అందుకు కృషి చేసిన సిఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ధన్యవాదాలు తెలిపారు.

రైతులకు న్యాయపరమైన పరిహారం, మామునూరును కోచ్చిన్ తరహాలో అభివృద్ధి చేసే ప్రణాళిక

మామునూరు విమా నాశ్రయం నిర్మాణానికి భూములిస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ. కోటి 20 లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించినట్టు వివరించారు. అలాగే ప్లాట్లకు, ఇళ్లకు సైతం న్యాయమైన పరిహారం చెల్లించేందుకు ప్రతిపాదిం చారు. గత నెల రోజులుగా భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో తాము జిల్లా ఇంఛార్జీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జిల్లాకి చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధి కారులు కృషి చేస్తున్నట్టు వివరించారు. కేరళలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం మాదిరిగా మామునూరు ఉండాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు వివరించారు. సుమారు 1,000 ఎకరాల్లో నిర్మించనున్నట్టు చెప్పారు. ఎయిర్ పోర్టు పూర్తయితే, మామునూరు విమానాశ్రయం ప్రారంభమైతే చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా సిద్ధిపేట జిల్లా కేంద్రం నుంచి అక్కడికి వెళ్లే రహదారుల వెంట అభివృద్ధి జరుగుతుం దని ఆశాభావం వ్యక్తం చేశారు.

భారతదేశంలో మొదటి బ్రౌన్ఫీల్డ్ విమానాశ్రయం ఏది?

భారతదేశంలో మొట్టమొదటి బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయం – ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని GVK నిర్వహిస్తుంది మరియు నిర్వహిస్తుంది మరియు నవీ ముంబైలో భారతదేశంలో అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించి నిర్వహించే ఆదేశాన్ని కూడా గెలుచుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Accident: ఘోరరోడ్డు ప్రమాదంలో ఇద్దరు డిఎస్పీలు మృతి

Breaking News Land Acquisition Funds latest news Mamunur Airport Revanth Reddy Telangana Development Telugu News Warangal airport

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.