📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Boxoffice : నాల్గోవారం లో కూడా తగ్గేదేలే అంటున్న మహావతార్ నరసింహా

Author Icon By Sudheer
Updated: August 16, 2025 • 3:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సాధారణంగా యానిమేషన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపవు. కానీ, ‘మహావతార్ నరసింహా’ (Mahavatar Narsimha) సినిమా ఈ అంచనాలను తారుమారు చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. జూలై 25న విడుదలైన ఈ చిత్రం, స్టార్ హీరోల సినిమాలకు కూడా సాధ్యం కాని రీతిలో భారీ వసూళ్లను రాబడుతోంది. విడుదలైన నాలుగో వారంలో కూడా ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఆగస్టు 16న శనివారం, హైదరాబాద్‌లో మధ్యాహ్నం ఆట సమయంలో 101 షోలు ప్రదర్శితం కాగా, అన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి.

వసూళ్లలో రికార్డులు

ఆగస్టు 14న రజినీకాంత్ నటించిన ‘కూలీ’, ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ నటించిన ‘వార్ 2’ వంటి భారీ చిత్రాలు విడుదలైనా, ‘మహావతార్ నరసింహా’ జోష్ మాత్రం తగ్గలేదు. ఆగస్టు 15న ఒక్క బుక్‌మైషో యాప్‌లోనే ఈ సినిమాకు 2.22 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ఆఫ్‌లైన్ అమ్మకాలు కలిపితే ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే రూ.250 కోట్ల వసూళ్లను దాటేసిందని సమాచారం. నాలుగో వారంలోనూ ఇదే జోరు కొనసాగిస్తే, వినాయక చవితి పండుగ వారాంతంలో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ తాండవం కొనసాగే అవకాశం ఉంది. ఈ వారం ముగిసేలోపు రూ.300 కోట్ల క్లబ్‌లో చేరి, ఫుల్ రన్‌లో రూ.350 నుంచి రూ.400 కోట్లు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

హిందీలో బాహుబలి రికార్డు బ్రేక్

‘మహావతార్ నరసింహా’ హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ఇప్పటికే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ‘బాహుబలి 1: ది బిగెనింగ్’ రికార్డును బద్దలు కొట్టింది. ‘బాహుబలి 1’ హిందీలో రూ.118.70 కోట్లు వసూలు చేసింది. ఈ రికార్డును బ్రేక్ చేయడం ద్వారా ‘మహావతార్ నరసింహా’, హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ చిత్రాల జాబితాలో టాప్ 10లోకి ప్రవేశించింది. చిన్న సినిమాగా వచ్చి, ప్రేక్షకుల ఆదరణతో ఇంతటి విజయాన్ని సాధించడం నిజంగా అసాధారణం.

https://vaartha.com/devara-2-been-stopped/movies/531123/

4th week Box Office Google News in Telugu Mahavatar Narsimha Mahavatar Narsimha collections

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.