📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే..

Review : ‘లోప‌లికి రా చెప్తా’ – నవ్వులే నవ్వులు

Author Icon By Sudheer
Updated: July 5, 2025 • 3:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా న‌టించిన సినిమా ‘లోప‌లికి రా చెప్తా’ (Lopaliki Ra Chepta). హార‌ర్ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు హీరోగా నటిస్తోన్న వెంక‌ట రాజేంద్ర ద‌ర్శ‌క‌త్వం వహించారు.  టైటిల్ తోనే ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందొ రివ్యూ లో తెలుసుకుందాం పదండి. 

కథ :

డెలివరీ బాయ్‌ రామ్‌ (కొండా వెంకట రాజేంద్ర), ప్రియ(సుస్మిత ఆనాల)కి పెళ్లి జరుగుతుంది. శోభనం రోజు గదిలోకి వెళ్లిన తర్వాత ప్రియ దెయ్యంలా మారి..రామ్‌ని భయపెట్టి, ముద్దు కూడా పెట్టుకోనియకుండా బయటకు పంపుతుంది. స్నేహితుడు ఇచ్చిన సలహాతో చేతికి తాయత్తు కట్టుకొని వెళితే.. రెండో రాత్రి కూడా అలాంటి పరిస్థితే ఎదురవుతుంది. దీంతో ఓ మంత్రగాడి(వంశీ) దగ్గరకు వెళ్తారు. ఆ మంత్రగాడు రామ్‌ నేపథ్యం గురించి అడగడంతో కథ ప్లాష్‌ బ్యాక్‌లోకి వెళ్తుంది.

డెలివరీ బాయ్‌ రామ్‌కి రోడ్డుపై ఓ అమ్మాయి(సాంచిరాయ్‌) పరిచయం అవుతుంది. ఆమెనే నెంబర్‌ ఇచ్చి.. రాత్రికి తన అపార్ట్‌మెంట్‌కి రమ్మని కబురు పంపుతుంది. అక్కడి వెళ్లిన రామ్‌.. విల్లా నెంబర్‌ తప్పుగా చెప్పి లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విల్లా నెంబర్‌ 91లో ఉన్నది ఎవరు? నైనిక (మనీషా జష్ణాని) ఎవరు? ఆమెతో రామ్‌కి ఉన్న సంబంధం ఏంటి? విక్కీ(అజయ్‌ కార్తిక్‌) ఎవరు? రామ్‌ ఫస్ట్‌ నైట్‌ జరగకుండా అడ్డుకుంటున్న దెయ్యం ఎవరు? దాని కోరిక ఏంటి? చివరకు రామ్‌ శోభనం జరిగిందా లేదా? అనేదే మిగతా కథ.

విశ్లేషణ :

కథగా చుస్తే ఇదొక చిన్న కథ. కానీ దాన్ని దర్శకుడు కమ్ హీరో రాజేంద్ర ఫన్ జోనర్ లో మలిచి నవ్వులు పూయించాడు. ముఖ్యంగా యూత్ కావాల్సిన రొమంటిక్ ఎలిమెంట్స్ తో కామెడీని జోడించి నవ్వించాడు. తన సినిమా ఆడియెన్స్ ను ఎవరి అనేది దర్శకుడు వెంకట రాజేంద్రకు చాలా క్లారిటీ ఉంది. అందుకు తగ్గట్టే సినిమాను మలిచాడు. ఫస్టాఫ్ ను గంట పదినిముషాలు, సెకండ్ హాఫ్ ను నలభై నిమిషాలతో పర్ఫెక్ట్ గా ముగించాడు. సెకండ్ ఆఫ్ లో వచ్చే ని సూదిలో నా దారం సాంగ్ సీరియస్ గా కథలో నవ్వులు పూయించి మెప్పించింది. 

నటీనటులు పర్ఫామెన్స్ :

హీరో కమ్ దర్శకుడు కొండా వెంకట రాజేంద్ర అన్ని తానై ఈ సినిమాను మోశాడు. తనదైన నటనతో అలరించాడు. యాక్టర్ గా మంచి ఫ్యూచర్ ఉంది. అలాగే హీరోయిన్ సుష్మిత అనాలా అద్భుతమైన పర్ఫెమెన్స్ ఇచ్చింది. మనీషా జిష్ణని పర్వాలేదు.శుభం సినిమాలో డిష్ రాజుగా చేసిన వంశి ఈ సినిమాలో బ్లాక్ స్పారో పాత్రలో చాలా బాగా చేసారు. ఇక ఎడిటింగ్ కూడా షార్పగా ఉంది. నిర్మాణ విలువలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఈగల్ సినిమా ఫేమ్ డేవ్ మ్యూజిక్, నేపధ్య సంగీతం బాగుంది. కెమెరా రేవంత్, అరవింద్ లొకేషన్స్ ను బాగా చూపించారు. 

ఓవరాల్ : లోపలికి వెళ్లిన వారికి నవ్వులు గ్యారింటి
మూవీ రేటింగ్ : 3/5

Read Also : Sreeleela- Kartik: రెస్టారెంట్ బయట శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ వీడియో హల్ చల్

lopaliki ra chepta lopaliki ra chepta movie lopaliki ra chepta review

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.