📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Chandrababu Naidu: లోకేశ్ మహానాడును మలుపు తిప్పారు: చంద్రబాబు ప్రశంస

Author Icon By Shobha Rani
Updated: May 28, 2025 • 12:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగుదేశం పార్టీ మహానాడు రెండో రోజు కార్యక్రమంలో పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ భవిష్యత్ దిశ, శాసనాలు, ప్రజా సంక్షేమం తదితర అంశాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) అన్నారు. ప్రజలు, పార్టీ భవిష్యత్తు కోసం నారా లోకేశ్ ప్రతిపాదించిన ఆరు శాసనాలు గొప్పగా ఉన్నాయని ప్రశంసించారు. మహానాడును లోకేశ్ ఒక మలుపు తిప్పారని కితాబునిచ్చారు. భవిష్యత్తు కోసమే ఆ శాసనాలని అన్నారు. ఈ ఆరు శాసనాలు సరికొత్త చరిత్రకు నాంది అని చెప్పారు. ఆర్థికంగా కార్యకర్తలను బలోపేతం చేసే దిశగా ఆలోచిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కార్యకర్తలకే పెద్దపీట వేస్తామని చెప్పారు. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మహానాడులో రెండో రోజు ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Chandrababu Naidu: లోకేశ్ మహానాడును మలుపు తిప్పారు: చంద్రబాబు ప్రశంస

వివేకా హత్య కేసుపై ఘాటైన విమర్శలు
వివేకా హత్య కేసులో నారాసుర రక్త చరిత్ర అంటూ తనపై నెపం మోపాలని చూశారని వైసీపీపై మండిపడ్డారు. ఏమీ తెలియనట్టు గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. మెదడు చితికిపోయేలా వివేకాను దారుణంగా నరికి చంపారని అన్నారు. నేరస్తుల ఆటలు సాగబోవని చెప్పారు. కోవర్టుల పట్ల పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. టీడీపీ(TDP)లో వర్గపోరు అంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఖబడ్దార్… మీ ఆటలు నా దగ్గర సాగవు అంటూ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో మహిళలపై అనుచిత పోస్టులు పెట్టేవారి తాట తీస్తామని హెచ్చరించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు అండగా ఉంటామని చంద్రబాబు చెప్పారు. బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. ఆగస్ట్ నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు. కార్యకర్తలే టీడీపీ (TDP)అధినేత అనేది టీడీపీ(TDP) సిద్ధాంతమని తెలిపారు. వలస పక్షులు వస్తుంటాయి, పోతుంటాయని… కార్యకర్తలే శాశ్వతంగా ఉంటారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు పదవులు ఇచ్చిన ఘనత టీడీపీ(TDP)దేనని అన్నారు. లక్ష మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేస్తామని చెప్పారు. పార్టీకి నిజమైన బలం విరాళం ఇవ్వగల, పోరాడగల కార్యకర్తలే అని అన్నారు. టీడీపీ (TDP) యొక్క విజయానికి మూలం శ్రద్ధతో పనిచేసే కార్యకర్తలే అని స్పష్టం చేశారు.

Read Also: YS Jagan: చిన్నారిపై అత్యాచారం కేసులో కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ మోహన్ డిమాండ్

Breaking News in Telugu Chandrababu praised Google news Latest News in Telugu Lokesh turned Mahanadu around: Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.