📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

కేంద్రం ప్యాకేజీ పై లోకేశ్ హర్షం

Author Icon By sumalatha chinthakayala
Updated: January 17, 2025 • 8:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి: విశాఖ ఉక్కుకు కేంద్రప్రభుత్వం రూ.11,440 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈప్యాకేజీపై మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రానికి గర్వకారణమైన వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు ప్రధాని మోడీ ఆమోదించిన రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని అందించారు. సీఎం చంద్రబాబు ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే ప్లాంట్‌కు పెద్దపీట వేసిన ప్రధాని మోడీకి ఈ క్రెడిట్ దక్కాలి. కేంద్రానికి ధన్యవాదాలు’ అని తెలిపారు.

Lokesh responded to Visakhapatnam steel industry package

ఉక్కు రెక్కల ఆయుధాలతో ఏపీ సరికొత్త శిఖరాలకు ఎదుగుతుందని, లక్షల మంది జీవితాలను మార్చుతుందని అన్నారు. ఈ ప్లాంట్ వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రలో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తుందని తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చెప్పారు.

మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడంపై కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్యాకేజీ కేటాయించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. ఈ ప్రకటించిన ప్యాకేజీలో రివైవల్ ప్యాకేజీకి కింద రూ.10,300 కోట్లు కేటాయించారని, ఉక్కు పరిశ్రమ నష్టాలను అధికమించేందుకు ఈ ప్యాకేజీ ఎంతో దోహదపడుతుందని చెప్పారు. ఉక్కు పరిశ్రమ పూర్తిస్థాయిలో ఉత్పాదకతతో లాభాల బాటలో పయనించేందుకు ఈ ప్యాకేజీ దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. నవ్యాంధ్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షల పట్ల కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధికి ఈ ప్యాకేజీ నిదర్శనమని రామ్మోహన్ వివరించారు.

Ap Google news lokesh PM Modi Visakhapatnam steel industry package

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.