Viral : పోలీస్ స్టేషన్ కు అనుకోని అతిధి..షాక్లో పోలీసులు

Read Time:  1 min
leopard in police station
leopard in police station
FONT SIZE
GET APP

తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా పోలీస్ స్టేషన్‌లోకి అనుకోని అతిథిగా చిరుత పులి ప్రవేశించింది. ఈ సంఘటన నిన్న రాత్రి 8.30 గంటల సమయంలో జరిగింది. రోడ్డు పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్‌కు అనూహ్యంగా పులి అడుగుపెట్టింది. అప్పటికే స్టేషన్ పరిసరాల్లో ఓ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తూ ఉండగా, ఈ ఘటనను గమనించి వెంటనే అలర్ట్ అయ్యారు.

కొద్దీ క్షణాల పాటు స్టేషన్ లోనే గడిపిన చిరుత

చిరుత స్టేషన్‌లోకి వచ్చినప్పటికీ, లోపల పెద్దగా ఎవ్వరూ కనిపించకపోవడంతో పులి కొన్ని క్షణాలు అక్కడ ఉండి, అనంతరం స్వయంగా బయటకు వెళ్లిపోయింది. అయితే, అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ అప్రమత్తమై తలుపులు వెంటనే మూసేసారు. ఈ ఘటనను స్టేషన్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలు స్పష్టంగా రికార్డ్ చేశాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read Also : Shoaib Akhtar: షోయబ్ అక్తర్ కి షాక్ ఇచ్చిన కేంద్రం

హానీ జరగకపోవడం ఊపిరి పీల్చుకునేలా చేసింది

ప్రాణాలు తీసే జంతువు పోలీస్ స్టేషన్‌లోకి రావడం అందర్నీ భయాందోళనకు గురి చేసింది. అయితే ఎవరికీ ఏవిధమైన హానీ జరగకపోవడం ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించడంతో పాటు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారని తెలుస్తోంది. జనావాసాల్లోకి అడవీ జంతువుల ప్రవేశంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

A Leopard decided to inspect the Naduvattam Police Station in Nilgiris. Hats off to the police person on duty who calmly closed the door and called forest officials. No one was hurt. Leopard went back safely to the forest #wildlife #TNForest pic.twitter.com/WEtXgW36kI— Supriya Sahu IAS (@supriyasahuias) April 29, 2025

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.