📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Delhi High Court: Lawyer: ఛీ..ఛీ..లైవ్‌లో మహిళకు లాయర్ ముద్దులు.. కోర్టు షాక్

Author Icon By Vanipushpa
Updated: October 16, 2025 • 5:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యాయ వ్యవస్థ మర్యాద, వృత్తిపరమైన ప్రవర్తనను ప్రశ్నిస్తూ ఢిల్లీ హైకోర్టుకు సంబంధించిన ఓ వీడియో (X, ఫేస్‌బుక్) సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది. న్యాయమూర్తి రాక కోసం ఎదురుచూస్తున్న సమయంలో.. వర్చువల్ కోర్టు విచారణ లైవ్‌లో ఉండగానే.. కోర్టు దుస్తుల్లో ఉన్న ఓ న్యాయవాది(Lawyer) తన గదిలో ఒక మహిళతో అభ్యంతరకరంగా ప్రవర్తించిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్‌ అవుతోంది. ఈ సంఘటన మంగళవారం (అక్టోబర్ 14)న జరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తి జస్టిస్ జ్యోతి సింగ్ బెంచ్ ఎదుట వర్చువల్ విచారణ ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందు ఈ దృశ్యం జరిగినట్లు సమాచారం.

Read Also: Bihar Elections: JDU రెండో జాబితా విడుదల

Lawyer: ఛీ..ఛీ..లైవ్‌లో మహిళకు లాయర్ ముద్దులు.. కోర్టు షాక్
https://twitter.com/ShoneeKapoor/status/1978397171037741541?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1978397171037741541%7Ctwgr%5Ee951d51f6752a712172e664f69f00a34640775a7%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Frtvlive.com%2Fnational%2Flawyer-kissing-woman-in-delhi-high-court-virtual-hearing-video-viral-10567860

మహిళను తన వైపుకు లాగి ముద్దులు

వీడియో ఫుటేజీ ప్రకారం.. ఒక న్యాయవాది తన గదిలో కోర్టు దుస్తుల్లో కూర్చుని ఉన్నాడు. కెమెరా లైవ్‌లో ఉందన్న విషయం మర్చిపోయాడా? లేక దానిని గమనించలేదో గాని అతడు తన ముందు చీర కట్టుకుని నిలబడిన ఒక మహిళను తన వైపుకు లాగి ముద్దులు పెట్టాడు. ఆ మహిళ నిరాకరించినప్పటికీ న్యాయవాది మాత్రం ఆగకుండా ఆమెకు ముద్దు పెట్టినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. వెంటనే ఆ మహిళ వెనక్కి వెళ్లిపోతూ కనిపించింది. న్యాయవాది మాత్రం కెమెరా వైపు చూడకుండా తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. న్యాయమూర్తి ఇంకా విచారణ ప్రారంభించనప్పటికీ.. లైవ్ స్ట్రీమింగ్ ఆన్‌లో ఉండటంతో ఈ మొత్తం దృశ్యం రికార్డ్ అయ్యింది. న్యాయమూర్తి రాక కోసం ఎదురుచూస్తున్న ఇతర న్యాయవాదులు, సిబ్బంది ఈ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా విస్తుపోయారు.

వేల సంఖ్యలో వ్యూస్

ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే వేల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయవాది వృత్తిపరమైన విలువలను ఉల్లంఘించాడని.. ఇది న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తుందని విమర్శిస్తున్నారు. ఆన్‌లైన్ విచారణల సమయంలో కూడా పాటించాల్సిన ప్రొటోకాల్స్‌ను న్యాయవాది ఉల్లంఘించారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు.

న్యాయవాదిపై క్రమశిక్షణా చర్యలు

ఈ ఘటనపై ఢిల్లీ హైకోర్టు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ, వీడియోలో ఉన్నది నిజమేనని రుజువైతే న్యాయవాదిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. గతంలో ఆన్‌లైన్ విచారణల్లో అనుచితంగా ప్రవర్తించిన న్యాయవాదులు, పౌరులపై కోర్టులు జరిమానాలు విధించడం, లేదా కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవడం వంటి ఘటనలు ఉన్నాయి. ఈ ఘటన కూడా అలాంటి చర్యలకు దారితీసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

భారతదేశంలో అత్యుత్తమ న్యాయవాది ఎలా ఉన్నారు?
భారతదేశంలో టాప్ 10 క్రిమినల్ న్యాయవాదులు ఎవరు? ఉన్నత ప్రొఫైల్ ...
భారతదేశంలో ఒకే ఒక్క "ఉత్తమ" న్యాయవాది లేరు, ఎందుకంటే ఈ రంగం విస్తృతమైనది మరియు ప్రత్యేకత అవసరం, కానీ న్యాయవాద వృత్తిలోని ప్రముఖ వ్యక్తులలో రామ్ జెఠ్మలానీ, హరీష్ సాల్వే.

న్యాయవాద వృత్తి మంచిదేనా?
న్యాయవాదులు అత్యధిక జీతం పొందే నిపుణులలో ఒకరు, వారి కెరీర్ ముందుకు సాగుతున్న కొద్దీ లాభదాయకమైన జీతాలను సంపాదించే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Courtroom Decorum Courtroom Incident Lawyer Misconduct legal ethics Live Video Scandal Telugu News Viral Video Woman Harassment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.