గ్యాడ్జెట్లు చేతిలోకి రావడంతో మన సమాజంలో విలువలు కూడా పతనమైపోతున్నాయి. లేతవయసులోనే ప్రేమలు, పెళ్లిళ్లు అంటూ అందమైన బంగారు భవిష్యత్తును (Latest News) పాడుచేసుకుంటున్నారు.
టీనేజ్లో కెరీర్కు ఉజ్వల బాటలు వేసుకోవాల్సిన సమయంలో ప్రేమ కోసం హంతకులుగా మారుతున్నారు. కెరీర్ పాడుచేసుకుని, అంధకారంలో జీవిస్తున్న వారిని ఎందరినో మనం చూస్తున్నాం. మధ్యప్రదేశ్లో కూడా ఇలాంటి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
18ఏళ్ల యువకుడు టీచర్ ను ప్రేమించాడు. (Latest News) ఆమె అతని ప్రేమను నిరాకరించడం మాత్రమే కాక స్కూల్లో అతనిపై ఫిర్యాదు చేసింది. ఆ కోపంతో విద్యార్థి టీచర్పై పెట్రోల్ దాడికి దిగాడు. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.
రెండేళ్లుగా టీచర్ పై పెంచుకున్న ప్రేమ విద్యార్థి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 26 ఏళ్ల బాధితురాలు ఓ ప్రవైట్ పాఠశాలలో గెస్ట్ టీచర్ గా పనిచేస్తున్నారు. నిందితుడు సూర్యాంక్ కోచర్ (18) గతంలో అదే పాఠశాలలో చదువుకున్న మాజీ విద్యార్థి.
సూర్యాంక్ గత రెండేళ్లుగా టీచర్ పై ప్రేమను పెంచుకున్నాడు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా స్కూల్కు వచ్చిన కోచర్ టీచర్ తో అసభ్యకరంగా మాట్లాడారు.
దీంతో ఉపాధాయురాలు అతనిపై పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఆగ్రహించిన సూరాంశ్ కక్ష పెంచుకున్నాడు.
ఇంట్లోకి చొరబడి పెట్రోల్ దాడి
ఈనెల 18వ తేదీన మధ్యాహ్నం టీచర్ ఇంట్లో ఉన్న సమయంలో, సూర్యాంక్ పెట్రోల్ బాటిల్తో ఆమె వెళ్లాడు. అక్కడ ఉపాధ్యాయురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనతో టీచర్ తీవ్రంగా గాయపడ్డారు.
ఆమె కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.
దీంతో టీచర్ ప్రాణాపాయం నుంచి తప్పించుకోగల్గారు. 15శాతం కాలిన గాయాలయ్యాయని, ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసుటు వెంటనే నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి, కొన్ని గంటల వ్యవధిలోనే సూర్యాంశ్ను అదుపులోకి తీసుకున్నారు.
వ్యక్తిగత కక్షతో జరిగిన దాడి: పోలీస్ ఆఫీసర్
కాగా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ మనోజ్ గుప్తా మాట్లాడుతూ, ఇది ఒకవైపు ప్రేమ, వ్యక్తిగత కక్షతో జరిగిన దాడి అని చెప్పారు. ఇలాంటి దారుణమైన సంఘటనలు సమాజంలో మహిళల భద్రతపై ఆందళనలు కలిగిస్తున్నాయి.
నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
గురువులను దైవంగా భావించాలే తప్ప ఇలాంటి తప్పుడు ఆలోచనలతో ఉండడం ప్రమాదకరం. పైగా తన ప్రేమను అంగీకరించలేదని హతమార్చడం దారుణమైన విషయం. చేతులారా జీవితాన్ని పాడుచేసుకుంటున్న యువకులు ఇకనైనా జాగ్రత్తగా జీవించాలి.
Read also: