📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Air India : ఎయిర్ ఇండియా చివరి ప్రమాదం ఎప్పుడు జరిగిందో తెలుసా.. ?

Author Icon By Sudheer
Updated: June 12, 2025 • 6:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎయిర్ ఇండియా (Air India) చివరిసారిగా ప్రమాదానికి గురైన ఘటన 2020 ఆగస్టు నెలలో చోటుచేసుకుంది. కరోనా మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “వందే భారత్ మిషన్” లో భాగంగా విదేశాల్లోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఈ విమానం నడిపారు. దుబాయ్ నుంచి కోజికోడ్ (కేరళ) వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ IX-1344 విమానం 2020, ఆగస్టు 7న (2020 AUG 72 Air India 2 IX-1344) ప్రమాదానికి గురైంది.

ల్యాండింగ్ సమయంలో రన్‌వే దాటి వెళ్లిన విమానం

అదేరోజు భారీ వర్షం కురుస్తుండగా, కోజికోడ్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ చేసే సమయంలో విజిబిలిటీ (కనిపించే దూరం) చాలా తక్కువగా ఉండటంతో విమానం నియంత్రణ కోల్పోయింది. దాంతో రన్‌వే దాటి పోయి లోయలో పడింది. ప్రమాద తీవ్రతకు విమానం రెండు ముక్కలైంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలట్లతో సహా మొత్తం 21 మంది మరణించగా, సుమారు 100 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

భారత విమానయాన చరిత్రలో మరో విషాద ఘట్టం

ఈ ప్రమాదం భారత విమానయాన చరిత్రలో గుర్తుండిపోయే దుర్ఘటనగా మారింది. “వందే భారత్ మిషన్” (Vande Bharat Mission) సమయంలో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు గురి చేసింది. విమాన సాంకేతిక లోపం కాకుండా, వాతావరణ పరిస్థితుల వల్ల ఏర్పడిన ప్రమాదంగా అధికారులు నిర్ధారించారు. అయితే ఇది ఎయిర్ ఇండియాకు అత్యంత తీవ్రమైన ప్రమాదాల్లో ఒకటిగా నమోదు కాగా, తాజాగా అహ్మదాబాద్ విమాన ప్రమాదం మరోసారి విమాన భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.

Read Also : Ahmedabad Plane Crash: మెడికల్‌ కాలేజ్‌ హాస్టల్‌పై కూలిన విమానం

air india 2 ix-1344 Google News in Telugu international flight on 7 August 2020 Vande Bharat Mission

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.