📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

KTR : కేటీఆర్‌పై కాంగ్రెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం

Author Icon By Divya Vani M
Updated: April 11, 2025 • 6:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) భూముల వ్యవహారం చుట్టూ ఇప్పుడు రాజకీయంగా వేడి రాజుకుంటోంది. రూ.10 వేల కోట్ల స్కాం ఉందంటూ తెరపైకి లాగిన బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టిగా బదులిచ్చారు. “48 గంటల్లో కుంభకోణాన్ని బయటపెడతానన్న కేటీఆర్ ఇప్పటిదాకా ఏం చేశాడు?” అంటూ నిలదీశారు.కేటీఆర్ వదిలిన ఆరోపణలు పెద్ద హైడ్రోజన్ బాంబులా పేలతాయని ప్రజలు అంచనా వేశారని, కానీ చివరకు అవి ఉల్లిగడ్డ బాంబులా కూడా పేలలేదని చామల వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రం అభివృద్ధి బాటలో పరుగులు పెడుతోందని, దీనికి ప్రజల మద్దతు లభిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ అసహనంతో ఇలా ఆరోపణలకు దిగజారాడని విమర్శించారు.

KTR కేటీఆర్‌పై కాంగ్రెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం

బిల్లీరావుతో కేటీఆర్ కుట్ర చేసినట్టు ఆరోపణ

ఈ భూముల కుంభకోణం వెనుక కేటీఆర్ పాత్ర ఉందని, బిల్లీరావుతో కలిసి వీటిని తమవైపు తిప్పుకోవాలన్న యత్నం జరిగిందని చామల పేర్కొన్నారు. కానీ ఆ ప్రయత్నం విఫలమవడంతో, మీడియా సమావేశం పెట్టి అసంతృప్తిని వ్యక్తపరిచారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేటీఆర్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.

ఎంపీ పేరు ఎందుకు చెప్పలేకపోతున్నారు?

భూముల వ్యవహారంలో ఎవరో ఎంపీ ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, ఆ ఎంపీ పేరు మాత్రం వెల్లడించకపోవడం పట్ల చామల ఆగ్రహం వ్యక్తం చేశారు. “తెలంగాణ ప్రజల ముందుకి వచ్చినప్పుడు నిజాలు స్పష్టంగా చెప్పాలి, అర్థం కానివి చెప్పి ప్రజలను మోసం చేయకూడదు” అని ఆయన హితవు పలికారు.ఈ వివాదం వెనుక ఉన్న అసలు ఉద్దేశం కేటీఆర్ రాజకీయ లబ్ధి కోసమేనని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలు దగ్గరపడుతుండగా, ఈ తరహా ఆరోపణలు చేయడం వారి వ్యూహం అని తేల్చేశాయి.

BRS vs Congress Congress MP Chamal HCU land scam Hyderabad land issue KTR allegations KTR controversy Telangana politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.