Khushbu daughter Avantika : ఒకప్పుడు దక్షిణ భారత సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన, ప్రస్తుతం బీజేపీ నేతగా ఉన్న ఖుష్బూ సుందర్ కుమార్తె అవంతిక సుందర్ వెండితెర అరంగేట్రానికి సిద్ధమయ్యారు. ఆమె మలయాళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా ప్రవేశించనున్నారు. ఆమె నటిస్తున్న తొలి చిత్రానికి “ఆరంభం” అనే ఆసక్తికరమైన టైటిల్‌ను నిర్ణయించారు. ఇటీవల త్రిశూర్ జిల్లాలోని చావక్కాడ్‌లో ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
సుమారు 35 సంవత్సరాల క్రితం, 1991లో ఖుష్బూ కూడా మోహన్‌లాల్ సరసన “అంకుల్ బన్” అనే మలయాళ చిత్రంతో ఆ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఇప్పుడు ఆమె కూతురు అవంతిక కూడా అదే పరిశ్రమను ఎంచుకోవడం విశేషంగా మారింది. ఈ చిత్రంలో అవంతిక “ఆరతి” అనే పాత్రలో కనిపించనున్నారు.
Read Also: Medak Municipal Chairman Election: డిల్లీలో లొల్లి.. గల్లీలో దోస్తీ:పద్మాదేవేందర్ రెడ్డి
దర్శకుడు సుజేష్ అన్నీ ఈపెన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, స్టూడియో బెల్లారూహ్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రముఖ నటులు ఇంద్రన్స్, విజయరాఘవన్, అల్తాఫ్ సలీం, కళాభవన్ షాజోన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మలయాళంతో పాటు తమిళంలో కూడా విడుదల చేయాలని యోచిస్తున్నారు.
ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా, అజయ్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజు సుందరం కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం కున్నంకుళం, చావక్కాడ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ వేగంగా కొనసాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: