📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Jogi Ramesh Arrest : జోగి రమేశ్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

Author Icon By Sudheer
Updated: November 3, 2025 • 11:23 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టైన మాజీ మంత్రి జోగి రమేశ్, ప్రధాన నిందితుడు జనార్దన్ రావు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. జోగి రమేశ్ మంత్రిగా ఉన్న కాలంలోనే జనార్దన్ రావుకు నకిలీ మద్యం తయారీకి మార్గం సుగమం చేశారని అధికారులు తెలిపారు. మొదట కృష్ణా జిల్లాలోని ములకలచెరువు ప్రాంతంలో మద్యం ఉత్పత్తి ప్రారంభించాలన్న సూచన రమేశ్ నుంచి వచ్చిందని సిట్ రిపోర్ట్‌లో వివరించారు.

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 03 నవంబర్ 2025 Horoscope in Telugu

రిమాండ్ రిపోర్ట్ ప్రకారం, రమేశ్ సూచనల మేరకు జనార్దన్ రావు మద్యం ఉత్పత్తి కోసం అవసరమైన పరికరాలు, కెమికల్ పదార్థాలు సేకరించాడని అధికారులు వెల్లడించారు. అలాగే మద్యం సరఫరా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడంలో రమేశ్ ప్రత్యక్ష, పరోక్ష సహకారం అందించాడని సాక్ష్యాలు లభించినట్లు పేర్కొన్నారు. ఈ చర్యల వెనుక రాజకీయ ఉద్దేశం కూడా ఉందని సిట్ అభిప్రాయపడింది. కూటమి ప్రభుత్వం ప్రజాదరణను దెబ్బతీయడం కోసం నకిలీ మద్యం ఘటనలను సృష్టించారని, ములకలచెరువు తర్వాత ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం హడావుడి కూడా అదే వ్యూహంలో భాగమని నివేదికలో పేర్కొన్నారు.

ఈ కేసుతో రాజకీయ వాతావరణం కుదురుకోవడం కష్టమవుతోంది. వైసీపీ నేతలు రమేశ్‌పై ఆరోపణలు రాజకీయ ప్రేరితమని అంటుండగా, ప్రభుత్వం మాత్రం దర్యాప్తు ఫలితాలే సత్యమని స్పష్టం చేస్తోంది. జోగి రమేశ్, ఆయన సోదరుడు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే 23 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు ధృవీకరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని కీలక వ్యక్తులు ఈ కేసులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. దీంతో రాష్ట్ర రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Google News in Telugu jogi ramesh jogi ramesh arrest jogi ramesh remand report Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.