📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

Congress Alliance : కాంగ్రెస్తో పొత్తు ఉండదని తేల్చేసిన కేజీవాల్

Author Icon By Sudheer
Updated: October 5, 2025 • 9:01 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

2027లో జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో తాము ఎలాంటి పొత్తు పెట్టుకోబోమని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. గోవాలో జరిగిన పార్టీ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. గత అనుభవాల కారణంగా కాంగ్రెస్‌పై ఎలాంటి నమ్మకం లేకపోయిందని తెలిపారు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ నిజానికి BJPకి MLAలను సరఫరా చేసే పార్టీగా మారిపోయింది అని ఆయన విమర్శించారు.

Latest News: Womens World Cup 2025: న్యూజిలాండ్‌ నుంచి ఆల్‌రౌండర్ ఫ్లోరా ఔట్

కేజ్రీవాల్ మాట్లాడుతూ.. “2017 నుంచి 2019 మధ్య కాంగ్రెస్ పార్టీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు BJPలో చేరారు. 2022లో కూడా 10 మంది ఎమ్మెల్యేలు BJPలోకి వెళ్లిపోయారు. ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని స్థితిలో ఉంది. భవిష్యత్తులో తమ ఎమ్మెల్యేలు ఎవరూ BJPలోకి వెళ్లరని కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు హామీ ఇవ్వగలదా?” అని ప్రశ్నించారు. కాంగ్రెస్ తన బలహీనతను ప్రజల ముందే ఒప్పుకుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ వ్యాఖ్యలతో గోవాలో రాబోయే రాజకీయ సమీకరణాలపై చర్చ మొదలైంది. AAP ఇప్పటికే గోవా రాజకీయాల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకోవడానికి కృషి చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ విమర్శలకు ఎలా స్పందిస్తుందో చూడాలి. గోవాలో BJP బలంగా ఉన్న నేపథ్యంలో AAP వేరు బాట పట్టడం రాబోయే ఎన్నికల్లో కొత్త పోటీ వాతావరణం సృష్టించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

congress alliance delhi ex cm kejriwal Google News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.