📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News:Maharastra:పంట రైతును వరించిన ‘కేబీసీ’ అదృష్టం: రూ. 50 లక్షలు గెలుపు

Author Icon By Pooja
Updated: October 5, 2025 • 12:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వ్యవసాయంలో నిత్యం కష్టపడే ఒక రైతు, ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) నిర్వహించే ‘కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ)’ షోలో పాల్గొని పెద్ద మొత్తంలో డబ్బు గెలుచుకున్నారు. తరచూ వరదలు, చీడపీడలతో పంట నష్టాలను చవిచూసిన ఆ రైతును ఈ కేబీసీ విజయం అదృష్ట రూపంలో వరించింది.

Read Also: Traffic Challan: కొత్త ట్రాఫిక్ చలాన్ నిబంధనలు

మహారాష్ట్రకు చెందిన కైలాశ్ కుంటేవార్, షోలో అమితాబ్ అడిగిన 14 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి రూ. 50 లక్షలు గెల్చుకున్నారు. కోటి రూపాయల ప్రశ్న విషయంలో సరైన జవాబు తెలియక, రిస్క్(Risk) తీసుకోవడం ఇష్టం లేక పోటీ నుంచి తప్పుకున్నారు.

కేబీసీ కోసం ప్రత్యేక సన్నద్ధత

మీడియాతో తన కేబీసీ అనుభవాన్ని పంచుకున్న కైలాశ్, తాను చిన్నప్పటి నుంచి చదువులో ముందుండే వాడినని చెప్పారు. కేబీసీ కేవలం వినోద కార్యక్రమంగానే భావించేవాడినని, అయితే 2018లో ఈ షోలో డబ్బు గెల్చుకున్న ఒక వ్యక్తితో మాట్లాడాక, దీనిపై సీరియస్‌గా దృష్టి సారించినట్లు తెలిపారు. అప్పటి నుంచి కేబీసీ కోసం ప్రత్యేకంగా సిద్ధమవడం ప్రారంభించానని వెల్లడించారు. రోజంతా పొలంలో కష్టపడ్డా, ఇంటికి వచ్చాక కనీసం ఒక గంటపాటు కేబీసీ కోసం ప్రిపేర్ అయినట్లు కైలాశ్ వివరించారు.

షోలో అద్భుతంగా ఆడి 50 లక్షలు గెలుచుకున్న తర్వాత, కోటి రూపాయల ప్రశ్న విషయంలో కొంత సందిగ్ధం ఏర్పడింది. దీంతో, రిస్క్ తీసుకోకుండా, అప్పటి వరకు గెల్చుకున్న 50 లక్షలతో సంతృప్తి పడి, పోటీ నుంచి తప్పుకున్నట్లు ఆయన తెలిపారు. తాను గెల్చుకున్న ఈ భారీ మొత్తాన్ని ముఖ్యంగా పిల్లల చదువులకే ప్రథమ ప్రాధాన్యమిస్తానని కైలాశ్ కుంటేవార్ స్పష్టం చేశారు.

కేబీసీలో రూ. 50 లక్షలు గెలుచుకున్న రైతు ఎవరు?

మహారాష్ట్రకు చెందిన కైలాశ్ కుంటేవార్ ఈ మొత్తాన్ని గెలుచుకున్నారు.

కైలాశ్ కుంటేవార్ ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారు?

ఆయన షోలో మొత్తం 14 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Amitabh Bachchan Show Farmer Kailash Kuntewar Google News in Telugu Kaun Banega Crorepati KBC Winner Latest News in Telugu Telugu News Today Won 50 Lakhs

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.