Kavitha New Party : కవిత ‘కొత్త పార్టీ’ ఖాయమా?

Read Time:  1 min
Revanth Reddy: రేవంత్ రెడ్డికి కవిత బహిరంగ లేఖ
Revanth Reddy: రేవంత్ రెడ్డికి కవిత బహిరంగ లేఖ
FONT SIZE
GET APP

తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నారని వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. జూన్ 2న, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం (Telangana State Formation Day) నాడు, ఆమె పార్టీని అధికారికంగా ప్రకటించే అవకాశముందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ కొత్త పార్టీకి “బహుజన సామాజిక న్యాయం” ప్రధాన నినాదంగా ఉండబోతోందని సమాచారం. ఇటీవలే కవిత “సామాజిక తెలంగాణ రాలేదు” అంటూ చేసిన వ్యాఖ్యలు ఈ కొత్త పార్టీ ప్రస్థానికి బలమైన సంకేతాలుగా మారినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.

సామాజిక న్యాయంపై దృష్టి

తెలంగాణ ఉద్యమం అనంతరం ఏర్పడిన పాలనలో వెనుకబడిన వర్గాలకు సరైన ప్రాతినిధ్యం కలిగలేదన్న అభిప్రాయంతోనే కవిత కొత్త పార్టీకి పునాదులు వేస్తున్నారన్న ఊహాగానాలు వెల్లివిరుస్తున్నాయి. ఆమె నడిపిన తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా ఇప్పటికే బహుళ సామాజిక వర్గాల్లో కవితకు పట్టు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బలంతో ఓ రాజకీయ ప్లాట్‌ఫాం ద్వారా సమానత్వం, న్యాయం అనే సిద్ధాంతాలతో ప్రజల్లోకి వెళ్లాలని ఆమె ఉద్దేశం ఉన్నట్టు తెలుస్తోంది.

BRSకి మద్దతు ఇస్తుందా ..?

కవిత ఏర్పాటు చేయబోయే పార్టీ బీఆర్ఎస్‌కు మద్దతుగా నిలుస్తుందా, లేక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందా అనే అంశం ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా మారింది. కవిత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురుగా ఉన్నా, గత కొన్ని నెలలుగా పార్టీ లోపలి వ్యవహారాలపై ఆమె అసంతృప్తిగా ఉన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ బీఆర్ఎస్ నుంచి దూరంగా సాగితే అది బీఆర్ఎస్‌కు గట్టినష్టమే. అదే మద్దతుగా ఉంటే, రాజకీయంగా వ్యూహాత్మకంగా వినియోగించే అవకాశం ఉంది. అసలు కవిత ఏ దిశలో అడుగులు వేస్తుందన్నది జూన్ 2న తేలనుంది.

Read Also : Former CID chief Sanjay : సంజయ్ సస్పెన్షన్ పొడిగింపు

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.