📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest news: Kavitha: కొత్త పార్టీ పై కవిత కీలక వ్యాఖ్యలు

Author Icon By Saritha
Updated: October 24, 2025 • 12:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

‘జాగృతి జనం బాట’ యాత్ర

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు(Kavitha) మరియు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 25వ తేదీ నుంచి ‘జాగృతి జనం బాట’ యాత్రను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ యాత్ర మొత్తం నాలుగు నెలల పాటు కొనసాగి, రాష్ట్రంలోని 33 జిల్లాలను సందర్శించనుంది. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం, వారికి సమాధానాలు కనుగొనడం ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని కవిత తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో యాత్రకు శ్రీకారం చుట్టనున్న కవిత, ప్రతి జిల్లాలో రెండు రోజుల పాటు వివిధ వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహించనున్నారు.

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనానంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రజల అభిలాష ఉంటే భవిష్యత్తులో రాజకీయ పార్టీ స్థాపనకు సిద్ధమని పేర్కొన్నారు. మరోవైపు, గ్రూప్-1 నియామకాల్లో జరిగిన అన్యాయంపై ఆమె తీవ్రంగా స్పందించారు.

Read also: బస్సు ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

Kavitha: కొత్త పార్టీ పై కవిత కీలక వ్యాఖ్యలు

వీవోఏల హక్కుల కోసం కవిత పోరాట పిలుపు

రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించి నియామకాలు జరగడం తెలంగాణ అభ్యర్థులకు అన్యాయం అని పేర్కొంటూ, సుప్రీంకోర్టు సుమోటో విచారణ జరపాలని ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు వెల్లడించారు. విలేజ్ ఆర్గనైజర్ అసిస్టెంట్ల (వీవోఏ) వేతనాలను రూ.26 వేలుగా పెంచాలని డిమాండ్ చేస్తూ, ఇందిరా పార్క్‌లో జరిగిన మహాధర్నాలో కవిత(Kavitha) పాల్గొన్నారు. వీవోఏల హక్కుల సాధన కోసం తాను పోరాటానికి సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే లాఠీ దెబ్బలు తినడానికైనా వెనుకాడనని ప్రకటించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

kavitha Latest News in Telugu political tour Public Issues Telangana Jagruti Telangana news Telangana politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.