📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Terrorist : కశ్మీరీ పండిట్లు, రైల్వే ఆస్తులే ఉగ్రమూకల లక్ష్యం!

Author Icon By Sudheer
Updated: April 26, 2025 • 7:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కశ్మీర్‌లో భద్రతా వర్గాలు పూర్తిగా అప్రమత్తమయ్యాయి. తాజా సమాచారం ప్రకారం, టెర్రరిస్టులు కశ్మీరీ పండిట్‌లను, స్థానికేతరులను, ముఖ్యంగా రైల్వే ఆస్తులను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని నిఘా వర్గాలు గుర్తించాయి. పాకిస్తాన్ మద్దతుతో పనిచేస్తున్న ISI నుంచి ఇదే ఆదేశాలు వచ్చాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), స్థానిక పోలీస్ శాఖలు, భద్రతా దళాలకు హెచ్చరికలు

ఈ నేపథ్యంలో కేంద్రం మరింత భద్రతా చర్యలు చేపట్టింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), స్థానిక పోలీస్ శాఖలు, భద్రతా దళాలకు హెచ్చరికలు జారీచేసి అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. ముఖ్యంగా రైల్వే సిబ్బంది రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప తమ బ్యారక్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు కోరారు.

ప్రత్యేక నిఘా వ్యవస్థ అమలు

ఉగ్రవాదుల లక్ష్యంగా మారే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో భద్రతను పెంచుతూ, ప్రత్యేక నిఘా వ్యవస్థను అమలు చేస్తున్నారు. కశ్మీరీ పండిట్‌లు, ఇతర సామాన్య ప్రజలకు తగిన రక్షణ కల్పించే చర్యలు చేపడుతున్నట్టు అధికారులు వెల్లడించారు. పౌరులు అవసరమయ్యేంతవరకూ బయటకు రాకూడదని, అపరిచిత వ్యక్తులపై అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్న సూచనలు జారీ అయ్యాయి.

#Pakistani_Terrorists Google News in Telugu Kashmiri Pandits and railway assets targets of terrorists terrorist Terrorist attack

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.