భగవద్గీత మీద ప్రమాణం చేసిన కాష్‌ పటేల్

Read Time:  1 min
Kash Patel took oath on Bhagavad Gita as FBI director
Kash Patel took oath on Bhagavad Gita as FBI director
FONT SIZE
GET APP

భారతీయ మూలాలు మరిచిపోలేదంటూ ప్రశంసలు

వాషింగ్టన్: అమెరికా 9వ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా ప్రవాస భారతీయుడు కాష్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా కాష్ పటేల్‌ను అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేయడం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం నాడు ఓటింగ్ నిర్వహించగా అమెరికా సెనెట్ లో 51 -49 ఓట్ల తేడాతో భారత సంతతికి చెందిన కాష్ పటేల్ విజయం సాధించారు. ఇదివరకే భారత సంతతికి చెందిన పలువురు అమెరికాలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

భగవద్గీత మీద ప్రమాణం చేసిన

భగవద్గీత మీద ప్రమాణం..

ఎఫ్‌బీఐ కొత్త డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన కశ్యప్ అలియాస్ కాష్ పటేల్‌ బాధ్యతలు స్వీకరించారు. అయితే కాష్ పటేల్ FBI డైరెక్టర్‌గా ఇండియా స్టైల్ లో భగవద్గీత మీద ప్రమాణం చేయడం హాట్ టాపిక్ అవుతోంది. గాళ్‌ఫ్రెండ్ అలెక్సీస్ విల్ కిన్స్ భగవద్గీతను చేతిలో పట్టుకోగా దానిపై చేయి ఉంచి ఎఫ్‌బీఐ నూతన డైరెక్టర్‌గా కాష్ పటేల్ ప్రమాణం చేశారు. కాష్ పటేల్ చేత అటార్నీ జనరల్‌ పామ్‌ బోండీ ప్రమాణం చేయించారు. ఎక్కడ ఉన్నా భారత సంప్రదాయాలు, మూలాలు మరిచిపోలేదు అంటూ కాష్ పటేల్ పై భారతీయులు ప్రశంసల జల్లులు

ఆయనకు అనుకూలంగా 51, వ్యతిరేకంగా 49 ఓట్లు

కాగా, భారత సంతతికి చెందిన కాష్ పటేల్ డొనాల్డ్ ట్రంప్‌కి వీర విధేయుడు. అందుకే ఈయనను అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థకు డైరెక్టర్‌గా నియమించారు ట్రంప్. దీంతో ఈయన నియమాకం అధికారికంగా ధ్రువీకరించినట్టయ్యింది. రిపబ్లికన్‌లకు మెజార్టీ ఉన్న సెనేట్‌లో కాష్ పటేల్ నియమాకంపై ఓటింగ్ నిర్వహించారు. అయితే, అనూహ్యంగా ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు పార్టీ విప్ ధిక్కరించి ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు. మైనే, అలస్కా సేనేటర్లు సుశాన్ కొలిన్స్, లీసా ముర్కోస్కీలు పటేల్‌ నియమాకాన్ని వ్యతిరేకించారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.