📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Karre Gutta : కర్రెగుట్టలో ఎన్‌కౌంటర్‌: 22 మంది మావోయిస్టులు హతం

Author Icon By Digital
Updated: May 8, 2025 • 12:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చర్ల సమీపంలోని కరిగుట్టల్లో బుధవారం ఉదయం ఘోర ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో 22 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటనలో మృతిచెందినవారిలో 11 మంది మహిళలు ఉండటం గమనార్హం. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించినట్టు, 2026 మార్చికి మావోయిస్టు ప్రభావాన్ని పూర్తిగా అంతం చేస్తామన్న లక్ష్యంతో భద్రతా బలగాలు చర్యలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా “ఆపరేషన్ కరిగుట్టలు” భాగంగా గత 16 రోజులుగా బలగాలు విశ్రాంతి లేకుండా కూబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి.భద్రతా బలగాలు మొదట ఫార్వర్డ్ బేస్‌లను ఏర్పాటు చేసి, మావోయిస్టుల చలనం ఉన్న ప్రాంతాలైన అబూబ్ మధ్ నేషనల్ ఏరియా పార్క్ చుట్టుపక్కల కట్టుదిట్టమైన ముప్పుతిప్పలు ఎదుర్కొంటున్న మావోయిస్టులను గుర్తించి ఆపరేషన్లు చేపట్టారు. ఈ క్రమంలో అనేక ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. మావోయిస్టు అగ్రనేతలు సేఫ్ జోన్ కోసం కరిగుట్ట ప్రాంతానికి తరలివచ్చిన సమయంలో అక్కడే మకాం వేసిన భద్రతా బలగాలు కీలక సమాచారం ఆధారంగా దాడులకు దిగాయి.

Karre Gutta : కర్రెగుట్టలో ఎన్‌కౌంటర్‌: 22 మంది మావోయిస్టులు హతం

Karre Gutta : కరిగుట్టల్లో ఘోర ఎన్‌కౌంటర్ – మావోయిస్టులకు గట్టి దెబ్బ

హెలీకాఫ్టర్లు, డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తూ మావోయిస్టుల బంకర్లు, స్థావరాలను గుర్తించి నిర్వీర్యం చేశారు. ఇప్పటివరకు 30 మంది మావోయిస్టులు ఈ ఆపరేషన్‌లో హతమయ్యారు. ఈ 22 మంది మావోయిస్టుల మృతదేహాల్లో 19 మృతదేహాలను స్వాధీనం చేసుకొని బీజాపూర్‌కు తరలించారు. మృతుల్లో కీలక మావోయిస్టు నేతలు ఉన్నారనే ఊహలు ఉన్నా, చత్తీస్‌గఢ్ పోలీసులు దీనిని ధృవీకరించలేదు.ఈ ఎన్‌కౌంటర్‌ను సీఆర్పీఎఫ్ డిజీ జానేంద్ర ప్రతాప్, చత్తీస్‌గఢ్ ఎడిజీ (నక్సల్స్ ఆపరేషన్) వివేకానంద సిన్హా, సీఆర్పీఎఫ్ ఐజీ అగర్వాల్ సమీక్షించారు. భద్రతా బలగాలు ప్రస్తుతం కరిగుట్టల్లో తాత్కాలిక బేస్ ఏర్పాటు చేసి మరింత దూకుడుగా మావోయిస్టులపై చర్యలు కొనసాగిస్తున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పాలన్న ప్రభుత్వ ధ్యేయంతో ఈ ఆపరేషన్ కీలక మలుపు తిరుగుతోంది.

Read More : Operation Sindhur: ‘ఆపరేషన్ సిందూర్’ పై అంతర్జాతీయ మీడియా స్పందన

Breaking News in Telugu Cherla News CRPF Action Google news Google News in Telugu Indian Security Forces Karrigutta Operation Latest News in Telugu maoist encounter Maoist Women Naxal Violence Telangana Maoists Telugu News Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.