పదవీ విరమణ సమీపిస్తున్న సమయంలో కొందరు న్యాయమూర్తులు(Justice Suryakant) వరుసగా కీలక ఉత్తర్వులు జారీ చేయడంపై సుప్రీంకోర్టు(Supreme Court) ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి ధోరణి న్యాయవ్యవస్థ విశ్వసనీయతపై ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించింది. రిటైర్మెంట్‌కు ముందు వచ్చే చివరి రోజుల్లో తీసుకునే నిర్ణయాలు సంయమనంతో ఉండాలని సూచించింది. ఈ సందర్భంగా జడ్జీల ప్రవర్తనను క్రికెట్ మ్యాచ్ చివరి ఓవర్లలో బ్యాటర్ హడావుడిగా సిక్సర్లు కొట్టే ప్రయత్నంతో పోల్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ జిల్లా న్యాయమూర్తి తన పదవీ విరమణకు కేవలం పది రోజుల ముందు సస్పెన్షన్‌కు గురయ్యారు. రెండు వివాదాస్పద ఉత్తర్వులు ఇచ్చారన్న కారణంతో హైకోర్టు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సంబంధిత న్యాయమూర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం, రిటైర్మెంట్ సమయానికి దగ్గరగా ఇలాంటి ఉత్తర్వులు రావడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది. ఇది ఒక అనవసరమైన ట్రెండ్‌గా మారుతోందని స్పష్టం చేసింది.
Read also: AP Weather: ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
న్యాయపరమైన పొరపాట్లు – దురుద్దేశాల మధ్య తేడా
పిటిషనర్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది,((Justice Suryakant) తమ క్లయింట్‌కు మంచి సేవా రికార్డు ఉందని, కేవలం న్యాయపరమైన నిర్ణయాల కారణంగా సస్పెన్షన్ విధించడం సరికాదని తెలిపారు. పై కోర్టుల్లో సవాలు చేయగల ఉత్తర్వులకు క్రమశిక్షణ చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.
దీనిపై స్పందించిన ధర్మాసనం, సాధారణ న్యాయపరమైన పొరపాట్లు ఒకవైపు ఉంటే, ఉద్దేశపూర్వకంగా నిజాయతీ లేకుండా ఇచ్చే ఉత్తర్వులు మరోవైపు ఉంటాయని స్పష్టం చేసింది. కేవలం తప్పిదం జరిగితే చర్యలు తీసుకోవడం సమంజసం కాదని, కానీ దురుద్దేశం ఉంటే పరిస్థితి భిన్నంగా ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో నేరుగా జోక్యం చేసుకోకుండా, ముందుగా మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించే వెసులుబాటును పిటిషనర్‌కు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా ఆ అభ్యర్థనపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును ఆదేశించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: