📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Josh Hazlewood: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. స్టార్ పేసర్ ఔట్

Author Icon By Anusha
Updated: February 6, 2026 • 1:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు టి20 వరల్డ్‌కప్‌కు ముందు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ (Josh Hazlewood) గాయం కారణంగా టోర్నమెంట్ మొత్తానికి దూరమయ్యారు. కాగా ఇప్పటికే కమిన్స్ గాయం కారణంగా దూరం కాగా, స్టార్క్ రిటైరయ్యారు. వీరు లేకుండానే ఆస్ట్రేలియా ఆడబోతోంది.జోష్ హేజిల్‌వుడ్ సూపర్-8 దశ నాటికి కోలుకుంటాడని ఆస్ట్రేలియా యాజమాన్యం భావించినప్పటికీ..

Read Also: Under 19 WC: నేడే U19 వరల్డ్‌కప్ ఫైనల్

Josh Hazlewood: Big shock for Australia.. Star pacer out

సరైన జట్టును ఎంపిక చేస్తాం

తాజా నివేదికల ప్రకారం అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి ఇంకా చాలా సమయం పడుతుందని తేలింది. ఆస్ట్రేలియా జాతీయ సెలక్టర్ టోనీ డోడెమైడ్ మాట్లాడుతూ.. “హేజిల్‌వుడ్ (Josh Hazlewood) కోలుకోవడానికి మరింత సమయం పడుతుంది. అతనిని త్వరగా మైదానంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తే రిస్క్ పెరుగుతుంది. అందుకే అతడిని పక్కన పెట్టక తప్పలేదు” అని పేర్కొన్నారు.

ప్రస్తుతానికి హేజిల్‌వుడ్ స్థానంలో ఎవరినీ భర్తీ చేయడం లేదని.. అవసరాన్ని బట్టి తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.అయితే, ఈ పరిణామాలపై కెప్టెన్ మిచెల్ మార్ష్ స్పందిస్తూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. “మా జట్టులో సమర్థులైన ఆటగాళ్లకు కొదవలేదు. మార్కస్ స్టోయినిస్, కామెరాన్ గ్రీన్ వంటి సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్నారు. పరిస్థితులకు తగ్గట్టు సరైన జట్టును ఎంపిక చేస్తాం” అని ధీమా వ్యక్తం చేశాడు.

టీమ్: మార్ష్, బార్ట్‌లెట్, కొన్నోలీ, T డేవిడ్, డ్వార్షుయిస్, గ్రీన్, ఎల్లిస్, హెడ్, ఇంగ్లిస్, కుహ్నెమాన్, మాక్స్‌వెల్, రెన్షా, స్టోయినిస్, జంపా. రిజర్వ్: అబాట్

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Australia T20 World Cup Breaking News Josh Hazlewood latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.