📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: Jogi Ramesh: ఎస్సైపై హెచ్చరికలు చేసిన జోగి రమేష్ కుమార్తె

Author Icon By Saritha
Updated: November 4, 2025 • 10:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గందరగోళం

విజయవాడలోని(Jogi Ramesh) ప్రభుత్వ ఆసుపత్రిలో వైకాపా నేత జోగి రమేశ్ కుటుంబ సభ్యులు, అనుచరులు సృష్టించిన గందరగోళం కేసుగా మారింది. ఈ ఘటనపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడడంతో పాటు ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు అద్దాలను పగలగొట్టిన ఘటనలో జోగి రమేశ్ భార్య శకుంతల, కుమారులు రాజీవ్, రోహిత్ తదితరులను నిందితులుగా చేర్చారు.

నకిలీ మద్యం కేసులో అరెస్టైన జోగి రమేశ్, రాములను కోర్టులో హాజరుపరిచే ముందు వైద్య పరీక్షల కోసం పోలీసులు విజయవాడ(Vijayawada) ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే రమేశ్ కుటుంబ సభ్యులు, వైకాపా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొని, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట జరిగి, వార్డు ప్రవేశద్వారం వద్ద ఉన్న అద్దాలు పగిలిపోయాయి. జై జోగి అంటూ నినాదాలు చేస్తూ వారు ఆసుపత్రి ప్రాంగణంలో గందరగోళం సృష్టించారు.

Read also: వైష్ణవి హత్యకేసులో హైకోర్టు కీలక తీర్పు

Jogi Ramesh: ఎస్సైపై హెచ్చరికలు చేసిన జోగి రమేష్ కుమార్తె

ఎస్సైపై బెదిరింపులు నిందితులపై కేసులు నమోదు

డ్యూటీలో ఉన్న ఎస్సై శంకర్ రావు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసి, తీవ్రంగా బెదిరించినట్లు((Jogi Ramesh)) సమాచారం. ఇంకో రెండేళ్లే ఈ ప్రభుత్వం. నీ పేరు డిజిటల్ బుక్‌లో రాస్తాం. నీ కాలర్ పట్టుకుని చూపిస్తాం అంటూ హెచ్చరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ తికమకలో ఒక కానిస్టేబుల్ కిందపడిపోగా, అతడిని తొక్కుకుంటూ కొందరు ముందుకు దూసుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ సంఘటనపై పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం, విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేయడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ఈ ఘటనలో శకుంతల, రాజీవ్, రోహిత్‌లను వరుసగా ఏ1, ఏ2, ఏ3 నిందితులుగా నమోదు చేశారు. అదనంగా, వీడియో ఫుటేజీ ఆధారంగా మరో 10–15 మందిని నిందితుల జాబితాలో చేర్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

case hospital jogi ramesh Latest News in Telugu Police Politics Telugu News Vijayawada violence YSRCP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.