📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Breaking News – Janasena : జనసేన పుట్టింది ఆ మనిషి నుండే – పవన్ కళ్యాణ్

Author Icon By Sudheer
Updated: August 30, 2025 • 9:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పార్టీ ఆవిర్భావం గురించి, దాని ప్రయాణం గురించి విశాఖపట్నంలో జరిగిన ‘సేనతో సేనాని’ బహిరంగ సభలో మాట్లాడారు. సగటు మనిషి కోపం నుంచే జనసేన పార్టీ పుట్టిందని ఆయన అన్నారు. పోరాటాల గడ్డ తెలంగాణలో పార్టీని ప్రారంభించామని, 11 ఏళ్ల ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్‌లో నిలదొక్కుకున్నామని చెప్పారు. జనసేన ఒక కుటుంబం కోసం, రాష్ట్రం కోసం పెట్టిన పార్టీ కాదని, వంద శాతం స్ట్రైక్‌రేట్‌తో దేశంలోనే చరిత్ర సృష్టించిందని పవన్ కళ్యాణ్ గర్వంగా తెలిపారు. ఈ 11 ఏళ్ల ప్రయాణంలో కుటుంబం, సినిమాల కంటే పార్టీపైనే ఎక్కువ దృష్టి పెట్టానని ఆయన చెప్పారు.

పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో పార్టీకి ఎదురైన కష్టాలను కూడా ప్రస్తావించారు. 11 ఏళ్ల ప్రయాణంలో తగిలిన ఎదురు దెబ్బలు తమను మరింత రాటుదేల్చాయని, ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడ్డాం కాబట్టే ప్రజలకు మేలు చేయగలుగుతున్నామని అన్నారు. ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యలను పరిష్కరించడం, ఏజెన్సీలో డోలీ మోతలు చూసి హృదయం ద్రవించడం వంటి సంఘటనలు తన నిర్ణయం సరైనదే అని నిరూపించాయని చెప్పారు. 2019-24 మధ్య తమను అనేక రకాలుగా బాధించినా, ప్రధాని, హోంమంత్రిని సాయం అడగలేదని తెలిపారు. సహాయం అడిగితే పార్టీ మూసుకోవడం మంచిదనుకున్నానని, తాను, వీర సైనికులు ఎదురొడ్డి నిలబడ్డామని పవన్ కళ్యాణ్ అన్నారు.

రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ‘మెంబర్‌షిప్, లీడర్‌షిప్‌’తో ముందుకు వెళ్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. నాయకులు కింది స్థాయి నుంచి రావాలని ఆయన అన్నారు. ‘త్రిశూల్’ కార్యక్రమాన్ని దసరా తర్వాత ప్రారంభిస్తామని చెప్పారు. నిస్వార్థంగా పనిచేస్తున్న తమకు మంచి ఫలితాలే వస్తున్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ సభకు హాజరైన వీర మహిళలకు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సభ ద్వారా జనసైనికులకు భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

https://vaartha.com/latest-news-rahul-dravid-what-is-the-reason-for-rahul-dravids-departure-from-rajasthan/sports/538554/

Google News in Telugu Janasena Pawan Kalyan pawan speech Senato Senani Meeting

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.