చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్(Jinping)తో భారత విదేశాంగ మంత్రి ఎస్జె. జైశంకర్ (Jaishankar) భేటీ కావడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ విదేశాంగ విధానాన్ని సర్కస్‌లా మార్చి నాశనం చేస్తున్నారని విమర్శించారు. భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్న చైనా లాంటి దేశంతో ప్రభుత్వం ఎందుకు ద్వైపాక్షిక చర్చలు జరుపుతుందనే ప్రశ్నను రాహుల్ గాంధీ లేవనెత్తారు.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రశ్నలు
రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో పాటు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ మరియు ఇతర నాయకులు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు గుప్పించారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు పరోక్షంగా మద్దతు తెలిపిన చైనా… భారత్‌కు వ్యతిరేకంగా UNలో వ్యవహరించిన చైనా… అటువంటి దేశంతో ప్రస్తుతం చర్చలు జరపడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. చైనా వైఖరిని కేంద్ర ప్రభుత్వం అంత వీలుగా ఎందుకు చూస్తుందనే దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జైశంకర్ పర్యటనకు రాజకీయ దుమారం
జైశంకర్ గత ఐదేళ్లలో తొలిసారి ఇవాళ చైనాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనపై అధికారిక సమాచారం వెలువడకముందే, విపక్షాల నుంచి తీవ్ర ప్రతిస్పందన వచ్చింది. భారత్-చైనా సంబంధాల విషయంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలన్నది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. ద్వైపాక్షిక చర్చల నేపథ్యం, ఉద్దేశ్యం ప్రజలకు తెలియజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also : Telangana Ex ENC Muralidhar Rao : మురళీధర్రావు ఆస్తులు చూస్తే అవాక్కే!