📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Jagan Mohan Reddy: జగన్ అక్రమాస్తుల కేసులు కొట్టివేయండి.. హైకోర్టులో దాల్మియా సిమెంట్స్

Author Icon By Ramya
Updated: July 11, 2025 • 11:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి (Jagan Mohan Reddy) అక్రమాస్తుల వ్యవహారంలో నమోదు చేసిన సీబీఐ కేసును కొట్టివేయాలని కోరుతూ దాల్మియా సిమెంట్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం దాల్మియా సిమెంట్స్కు అక్రమ పద్దతుల్లో లీజులు కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా ఆయన కుమారుడు జగన్ కంపెనీల్లో దాల్మియా సిమెంట్స్ రూ.95 కోట్ల ముడుపులను పెట్టుబడిగా పెట్టిందని సీబీఐ కేసు నమోదు (CBI case registered) చేసింది. భారత సిమెంట్స్లో దాల్మియా వాటాలను ఫ్రెంచి కంపెనీకి విక్రయించగా రూ.146.58 కోట్లు వచ్చింది. అందులో పెట్టుబడులపై లాభం పన్ను పోనూ రూ.139 కోట్లు మిగిలింది. ఈ సొమ్మును ఖాతాల్లో చూపకుండా హవాలా మార్గంలో జగన్కు రూ.55 కోట్లు అందించిందని పేర్కొంది. దాల్మియా ఉద్యోగి జాయ్దీప్ బసు నుంచి ఆదాయపు పన్ను శాఖ స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ (pen drive) నుంచి రాబట్టిన సమాచారం ప్రకారం సీబీఐ దర్యాప్తును కొనసాగించగా జేఆర్ ఖాతాలో రూ.55 కోట్లకు సంబంధించిన లావాదేవీలు బయటపడ్డాయని, జేఆర్ అంటే జగన్ మోహన్ రెడ్డినని పేర్కొంది.

Jagan Mohan Reddy: జగన్ అక్రమాస్తుల కేసులు కొట్టివేయండి.. హైకోర్టులో దాల్మియా సిమెంట్స్

హవాలా మార్గాల్లో వచ్చిన సొమ్ము కేసు

Jagan Mohan Reddy: హవాలా మార్గాల్లో వచ్చిన సొమ్ముకు సంబంధించి ఆడిటర్ విజయసాయి రెడ్డికి పునీత్ దాల్మియా, దాల్మియా ఉద్యోగుల మధ్య సంకేత భాషలో ఈమెయిల్ వ్యవహారాలు నడిచాయని తెలిపింది. 3500 టన్నులు అందాయంటే రూ.35 కోట్లు అందాయంటూ కోడ్ భాషలో సాగిన ఈమెయిల్ గుట్టూ రట్టయిందని సీబీఐ పేర్కొంది. అయితే అక్రమంగా నమోదు చేసిన ఈ కేసును కొట్టివేయాలంటూ దాల్మియా సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కె. లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది టి. నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ చట్టవిరుద్ధంగా లీజులు మంజూరైతే జరిమానాలు ఉంటాయి తప్ప క్రిమినల్ కేసు ఉండదన్నారు.

సీబీఐ ఆరోపణలు: సంకేత భాష, పెన్ డ్రైవ్ ఆధారాలు

నీకది-నాకిది పెట్టుబుడులు పెట్టారని సీబీఐ ఆరోపిస్తోందని, దీన్ని విక్రయించడం ద్వారా లాభాలు వచ్చాయన్నారు. విక్రయించిన సొమ్ము జగన్ కు అందిందని ఈ విషయం పెన్ డ్రైవ్ ద్వారా బయటపడిందని సీబీఐ అంటోందని, ఈమెయిళ్లతో సంకేత భాష వినియోగించారాన్న ఊహాజనిత సీబీఐ నిరాకరించిందన్నారు. ఈకేసు ఆధారంగా ఎన్పోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆస్తులను జప్తు చేస్తోందని అందువల్ల విచారణను నిలిపివేయాలని కోరారు. సీబీఐ తరపు ప్రత్యేక న్యాయవాది శ్రీనివాస్ కపాటియా వాదనలు వినిపిస్తూ ఇదే కోర్టుఇండియా సిమెంట్స్ కేసులో ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకుని దాల్మియా సిమెంట్స్ ఈ పిటిషన్ దాఖలు చేసిం దన్నారు. ఇండియా సిమెంట్పై కేసును కొట్టివేస్తూ ఈ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీలు దాఖలు చేశామని చెప్పారు. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేస్తామని అన్నారు. దీనికి న్యాయమూర్తి అనుమతిస్తూ విచారణను ఈనెల 23కి వాయిదా వేశారు.

జగన్ మోహన్ రెడ్డి ఎవరు?

జగన్ అని ఏకనామంగా పిలువబడే యెదుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి (జననం 21 డిసెంబర్ 1972) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడు (ఎమ్మెల్యే)గా పనిచేస్తున్నారు.

జగన్ మోహన్ రెడ్డి ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు?

యెదుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి (జననం: 21 డిసెంబర్ 1972), జగన్గా ప్రసిద్ధి చెందిన ఆయన ఒక భారతీయ రాజకీయ నాయకుడు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యునిగా (MLA) పనిచేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Tirumala: సెప్టెంబర్ 24 నుండి తిరుమలేశుని వార్షిక బ్రహ్మోత్సవాలు

Breaking News CBIInvestigation DalmiaCements HawalaTransactions HyderabadHighCourt latest news llegalAssetsCase PenDriveEvidence Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.