Iran-Israel War : ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లుతున్న ఇరాన్

Read Time:  1 min
Iran-Israel War : ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లుతున్న ఇరాన్
FONT SIZE
GET APP

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులకు దిగడంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు, క్షిపణులను ఉపయోగించి టెహ్రాన్‌లోని కీలకమైన ఉగ్రవాద పాలన స్థావరాలను, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల తీవ్రతకు నగరంలోని పలు భారీ భవనాలు కుప్పకూలిపోగా, ఆకాశమంతటా దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

Khamenei Death: మరణం వెనుక పక్కా స్కెచ్: తొలి దాడుల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అంతం!

మరోవైపు, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా తన దూకుడును పెంచింది. ఇజ్రాయెల్ మిత్రదేశాలైన అబుదాబి, దుబాయ్, మరియు కువైట్‌లపై దాడులు చేసేందుకు ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను ప్రయోగిస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఈ పరిణామంతో గల్ఫ్ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ సంఘర్షణ కారణంగా ఈ ప్రాంతంలోని రవాణా వ్యవస్థ, చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలు ఈ ఉద్రిక్తతలను ఆందోళనతో గమనిస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.