గతేడాది జులై నెలలో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరి జిల్లాల్లోని ఎర్రకాలువ (Red Canal) ఉప్పొంగి వేలాది ఎకరాల పంట నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా అక్కడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కాగా, ఇప్పుడు వారికి మేల్కొలిపే శుభవార్తను రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) ప్రకటించారు. ఎర్రకాలువ ముంపు బాధితులకు ఇన్పుట్ సబ్సిడీని త్వరలో వారి ఖాతాల్లో జమ చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు.
అవసరమైన నిధుల విడుదలకు ఆదేశాలు
ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని, అవసరమైన నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. మరో వారం రోజుల్లోగా అన్నదాతల ఖాతాల్లో సబ్సిడీ జమ కాబోతుందని చెప్పారు. గత ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోకపోయిందని, కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాతే రైతుల బాధలకు పరిష్కారం కనిపిస్తోందని అన్నారు.
ముంపునకు శాశ్వత పరిష్కారం
ఇకపోతే ఎర్రకాలువ ముంపునకు శాశ్వత పరిష్కారం చూపించడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి దుర్గేశ్ తెలిపారు. బాధిత రైతులకు భరోసా కలిగించేలా చర్యలు చేపడుతున్నామని, పునరావాస పనులు వేగంగా పూర్తిచేస్తామని పేర్కొన్నారు. ముందస్తు చర్యలతో ఇకపై ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Read Also : Vladimir Putin : రష్యా గోల్ ఏంటో చెప్పిన పుతిన్