📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్

Breaking News – Urea Shortage : యూరియా కోసం కరీంనగర్‌లో వినూత్న నిరసన

Author Icon By Sudheer
Updated: September 15, 2025 • 7:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కరీంనగర్ మండలం దుర్షేడులో యూరియా (Urea ) కోసం రైతులు, మహిళా రైతులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. రాజీవ్ రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహిస్తూ, బతుకమ్మ ఆటలతో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వం వహించారు. యూరియా సరఫరా లోపంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, మహిళా రైతులు కూడా రోడ్డెక్కడం పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చూపిస్తోందని ఆయన పేర్కొన్నారు.

యూరియా కొరతపై గంగుల కమలాకర్ ఆగ్రహం

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Kamalakar) మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే రైతులు ఇంత కష్టాలు పడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా వరి పొట్టకు వచ్చే ఈ దశలో యూరియా అవసరం అత్యవసరం అయినప్పటికీ, అది రైతులకు అందడం లేదని తెలిపారు. యూరియా బ్లాక్ మార్కెట్‌కి తరలించడం వల్ల రైతులు సొసైటీల దగ్గర క్యూలలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుస్థితి పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధత కారణంగానే వచ్చిందని ఆయన ఆరోపించారు.

కఠిన హెచ్చరికలు, రైతుల డిమాండ్లు

రైతులకు యూరియా రెండు రోజుల్లో సరఫరా చేయకపోతే బ్లాకు గోదాములను కొల్లగొట్టేందుకు సిద్ధమని గంగుల కమలాకర్ హెచ్చరించారు. పంట నష్టం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి బతుకమ్మ ఆడుతూ నిరసన తెలపడంతో రాజీవ్ రహదారి పూర్తిగా స్తంభించింది. రైతులు చేతిలో యూరియా బస్తాలు పట్టుకుని నినాదాలు చేస్తూ, జిల్లా వ్యవసాయ అధికారి అక్కడికి రావాలని కోరారు. రైతుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రైతులు బలంగా డిమాండ్ చేశారు.

https://vaartha.com/sports-forced-to-play-against-pakistan-raina/sports/547687/

Google News in Telugu kamalakar urea shortage

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.