📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

నేడు ఇందిరా మహిళా శక్తి మిషన్ ఆవిష్కరణ

Author Icon By Sudheer
Updated: March 8, 2025 • 8:09 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం భారీ సభ నిర్వహించనుంది. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో లక్ష మందితో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ఇందిరా మహిళా శక్తి మిషన్-2025’ను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి మహిళా సంఘాలు, స్వయం సహాయ సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు భారీగా హాజరుకానున్నారు.

ఈ మిషన్ ప్రధాన లక్ష్యం

ఈ మిషన్ ప్రధాన లక్ష్యం సెర్చ్, మెప్మా సంస్థలను విలీనం చేసి కోటి మంది మహిళలకు రూ. లక్ష కోట్ల రుణం అందించడం. దీనివల్ల స్వయం సహాయ సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన పెరుగుతుందని ప్రభుత్వం నమ్మకంతో ఉంది. ఈ స్కీమ్ కింద మహిళలకు రుణ సౌకర్యాలు, సబ్సిడీలు, బీమా పథకాలు, వ్యాపారోద్ధరణ అవకాశాలు కల్పించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి

ఈ కార్యక్రమంలో మహిళల ఆధ్వర్యంలో నడిచే 150 అద్దె బస్సులను ప్రారంభించనున్నారు. అలాగే 31 జిల్లాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త పెట్రోల్ బంకులను ప్రారంభించే కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టనున్నారు. మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి సభలో స్పష్టం చేయనున్నట్లు సమాచారం.

మహిళా శక్తి మిషన్ కింద రుణబీమా, ప్రమాద బీమా పథకాలు

ఇందిరా మహిళా శక్తి మిషన్ కింద రుణబీమా, ప్రమాద బీమా పథకాలను కూడా ప్రారంభించనున్నారు. రుణ బీమా కింద ఋణగ్రహీత మహిళలు అకాల మరణం చెందితే వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయంగా బీమా సొమ్ము అందించనున్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలు మహిళల సాధికారతను పెంచేందుకు మద్దతు ఇస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

cm revanth Google news Indira Mahila Shakti Mission

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.