IndiGo flight cancellations : న్యూఢిల్లీ ఇటీవల తీవ్ర ఆపరేషన్ సంక్షోభాన్ని ఎదుర్కొన్న ఇండిగో ఎయిర్‌లైన్స్ పరిస్థితి క్రమంగా మెరుగుపడుతున్నట్లు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఇండిగో ప్రయాణికులకు ఇప్పటివరకు ₹610 కోట్ల రీఫండ్లు జారీ చేయడంతో పాటు, సుమారు 3,000 లగేజ్ బ్యాగులను డెలివరీ చేసినట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది. అయితే ఇంకా ఎన్ని రీఫండ్లు, ఎన్ని బ్యాగులు పెండింగ్‌లో ఉన్నాయన్న వివరాలను ఎయిర్‌లైన్ వెల్లడించలేదు.
విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇండిగో విమానాల సంఖ్య గత శుక్రవారం 706 నుంచి శనివారం 1,565కు పెరిగింది. ఆదివారం (డిసెంబర్ 7) చివరి నాటికి ఇది 1,650కు చేరుతుందని అంచనా. ఇంతకు ముందు రోజుకు సగటున 2,200 విమానాలు నడిపిన ఇండిగో, సంక్షోభం తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో పునరుద్ధరణకు చేరుకోలేదని తెలుస్తోంది. డిసెంబర్ 10 నాటికి పరిస్థితి సాధారణ స్థితికి రావచ్చని అధికారులు భావిస్తున్నారు.
Read Also: Telangana Heritage: జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణకు రెడీ
గత వారంలో ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానాలు రద్దు చేయడం (IndiGo flight cancellations) వల్ల దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొంది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో, ఈసారి ముందుగానే విమాన రద్దులపై ప్రయాణికులకు సమాచారం అందించినట్లు ఇండిగో స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, పరిస్థితిని సమీక్షించేందుకు ఇండిగో బోర్డు ‘క్రైసిస్ మేనేజ్‌మెంట్ గ్రూప్’ను ఏర్పాటు చేసింది. ఛైర్మన్ వి.ఎస్. మెహతా, డైరెక్టర్లు గ్రెగ్ సారెట్స్‌కీ, మైక్ విటేకర్, అమితాబ్ కాంత్, సీఈఓ పీటర్ ఎల్బర్స్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. ప్రయాణికుల సమస్యలను వేగంగా పరిష్కరించడంతో పాటు, నెట్‌వర్క్ అంతటా ఆపరేషన్‌లను స్థిరీకరించేందుకు ఈ బృందం నిరంతరం పనిచేస్తోందని ఎయిర్‌లైన్ తెలిపింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: