📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Operation Sindoor : పీవోకేలోకి భారత్ సైన్యం ఎంట్రీ..తోకముడిచిన పాకిస్థాన్

Author Icon By Sudheer
Updated: May 9, 2025 • 8:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత దేశం చివరకు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లోకి అడుగుపెట్టినట్టు అనధికార సమాచారం వెలుగులోకి వచ్చింది. ఎప్పటినుంచో దేశ ప్రజలు కోరుకుంటున్న ఈ చర్య తుది దశకు చేరిందని భావిస్తున్నారు. భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పీవోకేలో ఆపరేషన్ సిందూర్‌ను కొనసాగిస్తోందని సమాచారం. ఈ మేరకు ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడకపోయినా, భద్రతా వర్గాలు పీవోకేలో కార్యకలాపాలు జోరుగా సాగుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి.

భారత్ దాడికి వణుకుతున్న పాక్

భారత్ చేస్తున్న దాడులతో పాకిస్థాన్ వణికిపోతోంది. ప్రజల గుండెల్లో ధైర్యం నింపేందుకు ఆ దేశ మీడియా “చైనా ఇచ్చిన పేలని బాంబులతో మేము ఎదురొడ్డి పోతున్నాం” అని అబద్ధ ప్రచారానికి పాల్పడుతోంది. కానీ మైదానంలో వాస్తవం వేరే. భారత్ చేపట్టిన ఈ వ్యూహాత్మక దాడులలో పాక్ రాజధాని ఇస్లామాబాద్ వరకూ ఉగ్ర స్థావరాలు దెబ్బతిన్నట్లు సమాచారం. భారత డ్రోన్లు పాక్ ప్రధాని కార్యాలయ సమీపాన బాంబులు వేసినట్టు చెబుతున్నారు, ఇది పాక్ సైన్యంలో తీవ్ర ఆందోళన కలిగించింది.

బంకర్లలో దాక్కున్న పాక్ ప్రధాని

ఈ పరిణామాల మధ్య పాకిస్థాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ భద్రతా కారణాల చేత బంకర్లలో దాక్కొని ఉన్నట్టు సమాచారం. తాజాగా, ఆయన విదేశాలకు పారిపోవాలనే ప్రయత్నంలో ఉన్నారని పాక్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఇప్పటికే ఆ దేశ ఆర్మీ చీఫ్ కుటుంబంతో విదేశాలకు తరలిపోయినట్టు వార్తలొస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ లో రాజకీయ మరియు సైనిక వ్యవస్థ తడబడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. భారత సైన్యం సాహసోపేతమైన అడుగులతో దేశ భద్రతను కాపాడడమే కాకుండా శత్రుదేశాలకు గుణపాఠం నేర్పుతోంది.

Read Also : Indian Army : భారత్ దెబ్బకు అజ్ఞాతంలోకి పాక్ ప్రధాని

Google News in Telugu Indian Army enters PoK Operation Sindoor Pakistan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.