📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Big Breaking: మహిళల వన్డే ప్రపంచకప్ 2025 విజేతగా భారత్

Author Icon By Aanusha
Updated: November 3, 2025 • 12:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత మహిళల క్రికెట్ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు ఇది. ఎన్నో సంవత్సరాలుగా భారత మహిళా క్రికెట్ అభిమానులు ఎదురుచూసిన కలల క్షణం చివరికి సాకారమైంది. వన్డే ప్రపంచకప్ ట్రోఫీ కోసం దశాబ్దాల నిరీక్షణకు ముగింపు పలుకుతూ, భారత మహిళల జట్టు ప్రపంచ విజేతగా నిలిచింది.

Read Also: IND vs AUS: టీ20 సిరీస్‌.. టీమిండియా ఘన విజయం

టోర్నీలో పడుతూ లేస్తూ ఫైనల్‌ వరకు చేరిన భారత్.. తుది పోరులో అదిరే ఆటతీరుతో దక్షిణాఫ్రికాను ఓడించింది. రెండుసార్లు తృటిలో చేజారిన వన్డే ప్రపంచకప్‌ టైటిల్‌ను మూడోసారి ఒడిసిపట్టింది. 140 కోట్ల మంది భారతీయుల సంబురానికి కారణమైంది.

ఆదివారం నవీ ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌ (WWC 2025) కు వేదికైంది. వాస్తవానికి ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సింది. కానీ వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా అంటే సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైంది.

 WWC 2025

టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్.. భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58) సత్తాచాటడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ప్రొటీస్ జట్టు ముందు 299 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా వికెట్ ఇవ్వకూడదనే లక్ష్యంగా ఆడింది.

దీంతో ఆ జట్టు ఓపెనింగ్‌ బ్యాటర్లు 9.2 ఓవర్లలో 51 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే అమన్‌జోత్ కౌర్ అద్భుత ఫీల్డింగ్‌తో రనౌట్ రూపంలో దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వికెట్లు పడుతున్నా.. కెప్టెన్ లౌరా వోల్వార్ట్‌ మాత్రం మొండిగా బ్యాటింగ్ చేసింది.

సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై శతక్కొట్టిన ఆమె.. ఫైనల్‌లోనూ అదే రిపీట్ చేసింది. దీంతో ఆమె ఉన్నంత సేపు దక్షిణాఫ్రికా విజయంపై ధీమాగానే ఉంది. కానీ 101 రన్స్ చేసిన తర్వాత దీప్తి శర్మ బౌలింగ్‌లో ఆమె ఔట్ కావడంతో భారత్ విజయం ఖరారైంది. చివరకు దక్షిణాఫ్రికా 246 పరుగులకు ఆలౌట్ అయింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Breaking News ICC Women ODI World Cup final IND W vs SA W final India Women World Cup 2025 latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.