📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Modi: మా ప్రయోజనాలే ముఖ్యం..ట్రంప్ కు భారత్ గట్టి కౌంటర్

Author Icon By Vanipushpa
Updated: October 16, 2025 • 1:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) తనకు హామీ ఇచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించింది. దేశ ఇంధన భద్రత, వినియోగదారుల ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇంధన దిగుమతుల విషయంలో తమ విధానాలు పూర్తిగా దేశీయ అవసరాల మేరకే ఉంటాయని పేర్కొంది. “రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ ఆపేస్తుందని ప్రధాని మోదీ నాకు హామీ ఇచ్చారు. ఇది వెంటనే జరగకపోయినా, ఆ ప్రక్రియ త్వరలోనే ముగుస్తుంది” అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశం కావడంతో భారత విదేశాంగ శాఖ దీనిపై అధికారికంగా స్పందించింది.

Read Also: Pak-Afghan: పాక్–ఆఫ్ఘాన్ కాల్పుల విరమణ

Modi: మా ప్రయోజనాలే ముఖ్యం..ట్రంప్ కు భారత్ గట్టి కౌంటర్

భారతీయ ప్రజల ప్రయోజనాలే ముఖ్యం: రణధీర్ జైస్వాల్

విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, “భారత్ భారీ మొత్తంలో చమురు, గ్యాస్ దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయంగా ఇంధన ధరల్లో ఒడిదొడుకులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటమే మా ప్రథమ ప్రాధాన్యత. మా దిగుమతి విధానాలు పూర్తిగా ఈ లక్ష్యం ఆధారంగానే ఉంటాయి” అని వివరించారు. “స్థిరమైన ఇంధన ధరలు, సరఫరాల భద్రత అనేవి మా ఇంధన విధానంలోని రెండు ప్రధాన లక్ష్యాలు. దీనికోసం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇంధన వనరులను విస్తృతం చేసుకుంటున్నాం” అని ఆయన తెలిపారు. ఇక అమెరికా విషయానికొస్తే, చాలా ఏళ్లుగా ఆ దేశం నుంచి ఇంధన సేకరణను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని, గత దశాబ్ద కాలంలో ఇది క్రమంగా పెరిగిందని ప్రకటనలో పేర్కొన్నారు.

మోడీ ఎన్నిసార్లు ప్రధాని అయ్యారు?

2024 భారత సార్వత్రిక ఎన్నికల తర్వాత, మోడీ వరుసగా మూడవసారి ప్రధానమంత్రి అయ్యారు, బిజెపి మెజారిటీని కోల్పోయిన తర్వాత సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు, మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత అలా చేసిన రెండవ వ్యక్తి ఇది.

నరేంద్ర మోడీ భార్య పేరు ఏమిటి?

జసొదా బెన్, నరేంద్ర మోదీ / భార్య

“ప్రధాని నరేంద్ర మోడీ భార్య జశోదాబెన్ గురించి తెలుసుకోవలసిన 10 వాస్తవాలు” . ఇండియా టీవీ . మూలం నుండి 16 జూన్ 2024 న ఆర్కైవు చేసారు . 22 సెప్టెంబర్ 2020న తిరిగి పొందబడింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Donald Trump Geopolitics india India-US Relations Indian foreign policy National Interests Strategic Autonomy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.