📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

అమెరిక‌న్ మ‌ద్యంపై భార‌త్ 150 శాతం సుంకం: వైట్‌హౌజ్

Author Icon By sumalatha chinthakayala
Updated: March 12, 2025 • 2:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూయార్క్ : భారత్‌పై శ్వేత సౌధం కీల‌క ఆరోప‌ణ చేసింది. అమెరికా మ‌ద్యం, వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌పై భార‌త్ అధిక స్థాయిలో సుంకాలు వ‌సూల్ చేస్తున్న‌ట్లు చెప్పింది. అమెరిక‌న్ మ‌ద్యంపై భార‌త్ 150 శాతం దిగుమ‌తి సుంకాన్ని వ‌సూల్ చేస్తున్న‌ట్లు వైట్‌హౌజ్ ప్రెస్ కార్య‌ద‌ర్శి క‌రోలిన్ లివిట్ తెలిపారు. అమెరికా వ‌స్తువుల‌పై వివిధ దేశాలు విధిస్తున్న సుంకాల‌కు సంబంధించిన గ‌ణాంక వివ‌రాల‌ను ఆమె వైట్‌హౌజ్‌లో మీడియాకు వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా మ‌ద్యంపై ఇండియా భారీగా సుంకాన్ని వ‌సూల్ చేస్తుంద‌న్నారు.

బ‌ట‌ర్‌పై 300 శాతంకెన‌డా సుంకం

కెన‌డాతో జ‌రుగుతున్న ట్రేడ్ వార్ గురించి ప్ర‌శ్న వేయ‌గా ఆమె ఇండియాపై కూడా రియాక్ట్ అయ్యారు. అమెరికాను, దేశానికి చెందిన హార్డ్ వ‌ర్కింగ్ అమెరిక‌న్ల‌ను కూడా కెన‌డా మోసం చేస్తోంద‌న్నారు. అమెరికా ప్ర‌జ‌లు, వ‌ర్క‌ర్ల‌పై కెన‌డా స‌ర్కారు అత్య‌ధిక స్థాయిలో టారిఫ్‌లు వ‌సూల్ చేస్తున్న‌ట్లు ప్రెస్ సెక్ర‌ట‌రీ ఆరోపించారు. కెన‌డా, భార‌త్‌, జ‌పాన్ లాంటి దేశాలు వ‌సూల్ చేస్తున్న సుంకాల‌కు చెందిన ఛార్ట్‌ను ఆమె ప్ర‌జెంట్ చేశారు. అమెరికాకు చెందిన చీజ్‌, బ‌ట‌ర్‌పై 300 శాతం సుంకాన్ని కెన‌డా వ‌సూల్ చేస్తున్న‌ట్లు ఆరోపించారు.

ఎలాంటి ఒప్పందం కుదరలేదు

భారత్ అధిక సుంకాలు అమలు చేస్తున్నట్టు అధ్యక్షుడు ట్రంప్ గత కొన్ని రోజులుగా విమర్శలను వ్యక్తం చేస్తున్నారు. భారత్ తన సుంకాలను గణనీయంగా తగ్గించడానికి అంగీకరించిందని ఆయన ఇటీవల పేర్కొన్నారు. యునైటెడ్ స్టేట్స్‌పై గణనీయమైన సుంకాలను విధిస్తుందనే తన వాదనను పునరుద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, వాణిజ్య సుంకాల విషయంలో ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదని వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ సోమవారం పార్లమెంటరీ ప్యానెల్ కు తెలిపారు.

American alcohol Breaking News in Telugu Google news Google News in Telugu India tariff Karoline Leavitt Latest News in Telugu Telugu News online White House Press Secretary

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.