📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: IND vs AUS: రో-కో విధ్వంసం.. టీమిండియా ఘన విజయం

Author Icon By Anusha
Updated: October 25, 2025 • 4:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆస్ట్రేలియాలో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో పరాజయపాలైన టీమిండియా (Team India), మూడో, చివరి వన్డేలో సమష్టిగా రాణిస్తూ విజయం సాధించింది. ఆఖరి మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో భారత్ గెలిచింది. దీంతో సిరీస్ మొత్తం 2-1తో ఆస్ట్రేలియాకు కైవసం అయ్యింది.

Rohit Sharma: రోహిత్ శర్మ అద్భుత సెంచరీ

టీమిండియా సీనియర్ బ్యాటర్లలో రోహిత్ శర్మ(125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 121 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(81 బంతుల్లో 7 ఫోర్లతో 74 నాటౌట్) అజేయ అర్థశతకంతో రాణించాడు. తమలో ఇంకా వన్డే క్రికెట్ ఆడే సత్తా ఉందని చాటి చెప్పారు.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది.

మ్యాట్ రేన్‌షా(58 బంతుల్లో 2 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్(41), మాథ్యూ షార్ట్(30) విలువైన ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా(4/39) నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.

సునాయస విజయాన్నందుకుంది

వాషింగ్టన్ సుందర్(2/44) రెండు వికెట్లు పడగొట్టాడు.అనంతరం భారత్ 38.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 232 పరుగులు 69 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(24) మరోసారి విఫలమవ్వగా.. ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్ (Josh Hazelwood) ఒక వికెట్ పడగొట్టాడు.

IND vs AUS

సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ (Rohit Sharma) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. బుధవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.237 పరుగుల స్వల్ప లక్ష్యచేధనలో టీమిండియాకు శుభారంభం దక్కింది. శుభ్‌మన్ గిల్(24) త్వరగానే ఔటైనా.. తొలి వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం లభించింది.

క్రీజులోకి‌ వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ చెలరేగాడు. 63 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. విరాట్ కోహ్లీ  (Virat Kohli)తనదైన శైలిలో చెలరేగాడు. 56 బంతుల్లో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. రోహిత్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.105 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 168 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News final odi India vs Australia latest news rohit sharma century Telugu News Virat Kohli

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.