📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

దీపావళికి ముందు ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం..ప్రజల ఇబ్బందులు

Author Icon By sumalatha chinthakayala
Updated: October 18, 2024 • 5:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: దీపావళి పండుగకు ముందు దేశ రాజధానిలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగింది. పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీని పొగ, కాలుష్యం కమ్మేస్తోంది. దీపావళికి ముందే ఢిల్లీ ఎన్సీఆర్ లో గాలి నాణ్యత క్షీణించింది. దీంతో కళ్లు మంటలు, గొంతు నొప్పి, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై 293 పాయింట్లుగా గాలి నాణ్యత ఉంది. గత మూడు రోజుల నుంచి ఢిల్లీ ఎన్సీఆర్ లో కాలుష్య నివారణకు మొదటి దశ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్‌ఏపీ) అమలవుతోంది. ఢిల్లీ – ఎన్‌సిఆర్ లో కాలుష్య నియంత్రణకోసం శీతాకాల – నిర్దిష్ట వాయు కాలుష్య చర్యలను అమలు చేయాలని ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలకు కేంద్రం వాయు కాలుష్య నియంత్రణ ప్యానెల్ ఆదేశాలు జారీ చేసింది.

ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ నివేదిక ప్రకారం.. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-50 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగుందని పరిగణిస్తారు. AQI 51-100 మధ్యలో ఉంటే సంతృప్తికరమైన గాలి నాణ్యతగా పరిగణిస్తారు. AQI 101-200 మధ్య ఉంటే మధ్యస్థంగా గాలి నాణ్యత ఉందని అర్ధం. అదేవిధంగా AQI 201- 300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, AQI 301-400 మధ్య ఉంటే మరింత అధ్వాన్నంగా గాలి నాణ్యత ఉందని అర్ధం. AQI 401-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్ధం చేసుకోవచ్చు. గాలి నాణ్యత 447కు పడిపోవటం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. అయితే, ప్రస్తుతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై 293 పాయింట్లుగా గాలి నాణ్యత ఉంది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పరిశీలిస్తే.. ఆనంద్ విహార్ లో 339 పాయింట్లు, అలీపూర్ 304 పాయింట్లు, బవానా 329 పాయింట్లు, బురారీ 339 పాయింట్లు, ద్వారకా సెక్టార్ 324 పాయింట్లు, జహంగీర్‌పురి 354 పాయింట్లు, ముండ్కా 375 పాయింట్లు, నరేలా 312 పాయింట్లు, పంజాబీ బాగ్ 312 పాయింట్లు, రోహిణి 362 పాయింట్లు, షాదీపూర్ 337 పాయింట్లు, వివేక్ విహార్ 327 పాయింట్లు గాలి నాణ్యత ఉంది. గత మూడు రోజుల నుంచి ఢిల్లీ ఎన్సీఆర్ లో కాలుష్య నివారణకు మొదటి దశ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్‌ఏపీ) అమలవుతోంది.

గ్రాఫ్-1 కింద అమలులోకి వచ్చిన పలు ఆంక్షలు, నిబంధనలు ఇలా ..

. నిర్మాణాలు, కూల్చివేతల్లో దుమ్ము నివారణకోసం మార్గదర్శకాలను సరిగ్గా అమలు చేయడం.
. 500 చదరపు మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న నమోదు కాని ప్రాజెక్టులలో నిర్మాణ కూల్చివేత కార్యకలాపాలపై నిషేధం.
. మునిసిపల్ ఘన వ్యర్థాలు, నిర్మాణాల కూల్చివేత వ్యర్థాలను డంప్ సైట్ల నుండి క్రమం తప్పకుండా తీసివేయడం
. మెకానికల్ స్వీపింగ్, రోడ్లపై నీటిని చల్లడం.
. యాంటీ స్మోగ్ గన్‌ల వినియోగాన్ని పెంచడం.
. రోడ్డు నిర్మాణ కార్యకలాపాలలో దుమ్ము నియంత్రణ చర్యలను అమలు చేయడం.
. బయోమాస్ పురపాలక ఘన వ్యర్థాలను బహిరంగంగా కాల్చడంపై నిషేధం.
. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ట్రాఫిక్ పోలీసుల మోహరింపు.
. వాహనాలకోసం పీయూసీ ప్రమాణాలను ఖచ్చితంగా పర్యవేక్షించడం.
. ప్రజల అవగాహన కోసం మొబైల్ యాప్‌లు, సోషల్ మీడియాను ఉపయోగించడం.
. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రెడ్ లైట్ ఆన్ వెహికల్ ఆఫ్ కార్యక్రమం అమలు.
. టపాకాయల తయారీ, విక్రయం, వినియోగంపై నిషేధం.

air pollution delhi Diwali festival haryana Punjab

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.