భారత వైమానిక దళం (IAF) లో కీలకమైన పదవిగా భావించే వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ బాధ్యతలను ఎయిర్ మార్షల్ నగేష్ కపూర్ గురువారం స్వీకరించారు. ఢిల్లీలోని వాయు భవన్ లో అధికారికంగా బాధ్యతలు చేపట్టిన ఆయన, నాలుగు దశాబ్దాల పాటు దేశానికి సేవలందించి పదవీ విరమణ చేసిన ఎయిర్ మార్షల్ నరమదేశ్వర్ తివారీ స్థానంలో నియమితులయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ అధికారులు, వైమానిక దళ ఉన్నతాధికారులు హాజరయ్యారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ గ్రాడ్యుయేట్ అయిన కపూర్, నిష్ణాతుడైన ఫైటర్ పైలట్, ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్, ఫైటర్ కంబాట్ లీడర్‌గా గుర్తింపు పొందారు.
Read also: BEML Recruitment: BEMLలో 50 ఉద్యోగాల భర్తీ
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: