కల్తీ మద్యం కేసులో అరెస్టైన మాజీ మంత్రి జోగి రమేశ్ తనపై ఉన్న ఆరోపణలను ఘాటుగా ఖండించారు. అరెస్టు సమయంలో మీడియాతో మాట్లాడుతూ, “ఈ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదు. పూర్తిగా నిరాధారమైన ఆరోపణలతో నన్ను అరెస్ట్ చేశారు” అని తెలిపారు. తాను ప్రజల కోసం పనిచేసిన నేతనని, ఎప్పుడూ చట్టాన్ని గౌరవించానని స్పష్టం చేశారు. “నా మీద కేసు నమోదు చేయడం పూర్తిగా రాజకీయ ప్రతీకారం. నన్ను అరెస్ట్ చేయడం ద్వారా బీసీ నేతలను భయపెట్టే ప్రయత్నం జరుగుతోంది” అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
Breaking News – Tragedy in Kenya: కెన్యా లో కొండచరియలు విరిగిపడి 21మంది మృతి
జోగి రమేశ్ తన అరెస్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబునే బాధ్యుడిగా పేర్కొన్నారు. “నా అరెస్టుతో చంద్రబాబు రాక్షసానందం పొందాలనుకుంటున్నారు. ఆయన దుర్మార్గ పాలనలో ప్రజాస్వామ్యానికి చోటు లేదు” అంటూ ఆయన తీవ్రంగా విమర్శించారు. “నా భార్య, బిడ్డల సాక్షిగా చెబుతున్నా… నేను ఏ తప్పూ చేయలేదు. నా చేతుల మీదుగా ఒక్క చుక్క కల్తీ మద్యం కూడా రాలేదు. నిజం బయటపడే రోజు దగ్గరలోనే ఉంది” అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక, పోలీసుల తీరుపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ, చట్టపరమైన న్యాయం కోసం పోరాడతానని చెప్పారు.

ఇదిలా ఉండగా, జోగి రమేశ్ అరెస్టుతో కల్తీ మద్యం కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 20కి చేరింది. ఈ కేసులో ఇప్పటివరకు వ్యాపారులు, మధ్యవర్తులు, రవాణా నిర్వాహకులు సహా పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిట్ అధికారులు కల్తీ మద్యం తయారీ, పంపిణీ, విక్రయ వ్యవస్థలపై లోతైన విచారణ జరుపుతున్నారు. ఈ కేసు రాజకీయ మలుపు తిరగడంతో, రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేతలు ఇది బీసీ వర్గాలపై లక్ష్యంగా చేసిన చర్యగా ఆరోపిస్తుండగా, ప్రభుత్వం మాత్రం న్యాయపరమైన చర్యలేనని సమర్థిస్తోంది. మొత్తం మీద, జోగి రమేశ్ అరెస్టు రాజకీయ వాతావరణాన్ని మరింత ఉత్కంఠతతో నింపింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/