రిజిస్ట్రేషన్ల గడువు 30వ తేదీకి పెంపు
Hyderabad: రాష్ట్రంలో కొనసాగుతున్న కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీలో ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటా ప్రవేశాల రిజిస్ట్రేషన్ కోసం నిర్దేశించిన గడువును పొడిగించారు. రిజిస్ట్రేషన్ను ఈ నెల 30 వరకూ పొడిగిస్తున్నట్టు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. గతంలో రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 25 వరకు ఉన్న సంగతి తెలిసిందే. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజుప్తుల మేరకు గడువును పొడిగించినట్టు (Deadline extended) యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. 2025-26 విద్యా సంవత్సరానికి కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సులలో ప్రవేశానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం నోటిఫికేషన్ఆ నెల 15న జారీ చేసిన విషయం తెలిసిందే.
అభ్యర్థుల విజ్ఞప్తుల నేపథ్యంలో ఎంబిబిఎస్, బిడిఎస్ దరఖాస్తులకు గడువు పొడిగింపు
రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద 2025-26 విద్యా సంవత్సరానికి ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్ ఎలిజిబిలిటీకమ్ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) యుజి-2025లో కటాఫ్ స్కోర్లు, అంతకంటే ఎక్కువ సాధించడం ద్వారా అర్హత సాధించిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తుల (Online applications) చివరి తేదీని పొడిగించారు. విద్యా ర్థులు, తల్లిదండ్రుల నుండి వచ్చిన అనేక అభ్యర్థనలతోపాటు స్థానిక, స్థానికేతర సమస్యలకు సంబంధించి కోర్టు కేసు కారణంగా ఈ నెల 30 సాయంత్రం 5 గంటల వరకు పొడిగించినట్టు రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు.
కాళోజీ నారాయణరావు విశ్వవిద్యాలయం ప్రభుత్వ లేదా ప్రైవేట్ విశ్వవిద్యాలయమా?
కాళోజీ నారాయణరావు యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (KNRUHS) భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరంలో ఉన్న ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం. తెలంగాణ ఉద్యమ కవి మరియు రాజకీయ ఉద్యమకారుడు కాళోజీ నారాయణరావు పేరు మీదుగా యూనివర్సిటీకి పేరు పెట్టారు..
కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ర్యాంక్?
కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (KNRUHS), ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం 2014లో స్థాపించబడింది. ఇది తెలంగాణలోని వరంగల్‌లో ఉంది. 2022 NIRF ర్యాంకింగ్‌లో, KNRUHS అగ్ర వైద్య విశ్వవిద్యాలయాలలో 17వ ర్యాంక్‌ను పొందింది. ఈ విశ్వవిద్యాలయం UGCచే గుర్తింపు పొందింది.
కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ సీటు ఎలా పొందాలి?
కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ MBBS, BAMS మరియు BDS కోర్సులలో ప్రవేశానికి NEET-UG స్కోర్‌ను పరిగణిస్తుంది. అభ్యర్థులు NEET-UG స్కోర్ లేకుండానే అన్ని ఇతర ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందవచ్చు. 2024లో, MBBS కోర్సుకు NEET ముగింపు ర్యాంక్ ఆల్ ఇండియా కేటగిరీకి 3565.
Read hindi news: hindi.vaartha.com
Read also: Sridhar Babu: ఇ-గవర్నెన్స్, డిజిటలైజేషన్లో ఎస్తోనియా సహకారం తీసుకుంటాం :మంత్రి శ్రీధర్ బాబు