📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News:Hyderabad: పర్యాటక శాఖతో ఒప్పందాలు – ఆరు ఫైవ్‌స్టార్ హోటళ్లు

Author Icon By Pooja
Updated: October 6, 2025 • 10:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా(tourist destination) అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా నగరంలో ఆరు ఫైవ్ స్టార్, ఒక ఫోర్స్టార్ హోటల్తో పాటు.. ఒక ట్రేడ్ సెంటర్.. నగరం వెలుపల ఒక వెల్నెస్ రిసార్ట్ నిర్మించనున్నారు. అభివృద్ధి చెందిన ప్రాంతాలలో సుమారు రూ. 6 వేల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టులు రానున్నాయి. ఈ నిర్మాణాల ద్వారా పర్యాటక రంగంలో సుమారు 8 వేల మందికి ఉపాధి లభిస్తుందని పర్యాటక శాఖ అంచనా వేస్తోంది.

Read Also: Bharat Dynamics Limited : ఏపీకి మరో ప్రతిష్ఠాత్మక సంస్థ!

హైదరాబాద్ నగరం పర్యాటక రంగంలో(tourism sector) సరికొత్త పురోగతిని సాధించే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర రాజధానిని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు.. పర్యాటక శాఖ వసతి సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ లక్ష్య సాధనలో భాగంగా.. హైదరాబాద్లో ఏకంగా ఆరు ఫైవ్ స్టార్ హోటళ్లు, ఒక ఫోర్ స్టార్ హోటల్తో సహా ఒక ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. నగరానికి వచ్చే జాతీయ, అంతర్జాతీయ సందర్శకులకు అత్యున్నత స్థాయి ఆతిథ్యం అందించేందుకు ఈ భారీ ప్రాజెక్టును చేపట్టారు.

ఇటీవల జరిగిన టూరిజం కాన్ క్లేవ్ వివిధ దేశీయ, అంతర్జాతీయ సంస్థలతో ప్రభుత్వం ఈ నిర్మాణాల కోసం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ నిర్మాణాలు హైదరాబాద్లోని అత్యంత కీలకమైన.. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో రూపుదిద్దుకోనున్నాయి. ఆ ప్రాంతాల విషయానికి వస్తే.. రాయదుర్గం, బుద్వేల్, పుప్పాలగూడ, శంషాబాద్, నియోపోలిస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాంతాలలో ఈ హోటళ్లు, ట్రేడ్ సెంటర్ల నిర్మాణం జరగనుంది. కేవలం నగరం లోపల మాత్రమే కాకుండా, హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ఒక ప్రత్యేక వెల్నెస్ రిసార్ట్ను కూడా నిర్మించనున్నారు. ఇది నగర జీవితానికి దూరంగా, ప్రశాంతమైన వాతావరణంలో వినోదాన్ని అందిస్తుంది.

ఈ మొత్తం ప్రాజెక్టు కోసం ప్రభు త్వం సుమారుగా రూ. 6 వేల కోట్ల భారీ మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. ఇంత పెద్ద ఎత్తున హోటళ్ల నిర్మాణం చేపట్టడం వలన, ఆతిథ్యం (హాస్పిటాలిటీ), అనుబంధ రంగాలలో సుమారు 8 వేల మందికి నేరుగా లేదా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పర్యాటక శాఖ అంచనా వేస్తోంది. ఈ విస్తృత ప్రాజెక్టుల ద్వారా హైదరాబాద్ నగరంలోని పర్యాటక మోలిక సదుపాయాలు (1 గణనీయంగా మెరుగుపడతాయి. అధిక స్థాయి వసతి లభించడం వల్ల, విదేశీ పర్యాటకుల రాక పెరుగుతుంది. దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెరగడమే కాకుండా.. నగర గ్లోబల్ ఇమేజ్ కూడా మరింత పటిష్టం అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం టూరిజం రంగాన్ని రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఒక ముఖ్యమైన శాఖగా గుర్తించింది. ఈ ఫైవ్ స్టార్ హోటళ్లు, ట్రేడ్ సెంటర్ నిర్మాణంతో.. అంతర్జాతీయ వ్యాపార సదస్సులు, సమావేశాలు (కన్వెన్షన్స్) నిర్వహించడానికి కూడా హైదరాబాద్ ఒక ప్రధాన కేంద్రంగా మారుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Five Star Hotels Google News in Telugu Hospitality hyderabad Latest News in Telugu Luxury Hotels Telangana tourism Telugu News Today Tourism Department

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.